Saturday, October 25, 2025 11:07 PM
Saturday, October 25, 2025 11:07 PM
roots

వరకట్న నిషేధ చట్టం అంటే ఏంటీ..? శిక్షలు ఏంటీ..?

దేశంలో వరకట్నం డిమాండ్ చేస్తూ విపరీత చర్యలకు పాల్పడుతున్న భర్తల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. దీనితో భారత రాజ్యాంగంలో ఉన్న వరకట్న నిషేధ చట్టం అంటే ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఒకప్పుడు మహిళలను వివాహం చేసుకోవాలి అంటే కట్నం డిమాండ్ చేసేవారు. ఇప్పటికీ అది అనధికారికంగా అమలులోనే ఉంది. కులంతో సంబంధం లేకుండా.. అబ్బాయి మంచి వాడని నమ్మినా, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నాడని భావించినా వర కట్నం ఇవ్వడానికి అమ్మాయి తల్లి తండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read : అరుణ ఫోన్ లో ఐపిఎస్, మాజీ మంత్రి వీడియోలు..?

కాని వర కట్నం మన దేశంలో ఎప్పుడో నిషేధించారు. భారత పార్లమెంటు 1961 మే 1న వరకట్న నిషేధ చట్టాన్ని ఆమోదించింది. ఏ రూపంలోనైనా వరకట్నం ఇవ్వడం లేదా స్వీకరించడం దీని ప్రకారం నేరంగా పరిగణిస్తారు. అయితే దీనిలో కొన్ని మార్పులు చేసారు. వివాహ సమయంలో వధువులకు లేదా వధువు వరులకు బహుమతులు ఇచ్చేందుకు అనుమతిచ్చేందుకు 1984లో వరకట్న నిషేధ చట్టం, 1961ని సవరించారు. వరకట్న సంబంధిత హింస, మహిళలకు రక్షణ కల్పించడానికి 2005లో గృహ హింస నుంచి.. రక్షణ చట్టాన్ని ఆమోదించారు.

1961 వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం, ఒక వ్యక్తి వరకట్నం ఇచ్చినా, తీసుకున్నా, ప్రోత్సహించినా, వారికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష విధిస్తారు. అలాగే, రూ. 50 వేల రూపాయల జరిమానా.. లేదంటే వరకట్నం విలువతో సమానంగా జరిమానా ఉంటుంది. 1961 వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం, ఎవరైనా వధువు తల్లిదండ్రులు, లేదా సంరక్షకులు లేదా బంధువుల నుండి వరకట్నం అడిగితే, వారికి ఆరు నెలల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు.

Also Read : అనన్య నాగళ్ళ

వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 ఎ ప్రకారం , ఏదైనా వార్తాపత్రిక, జర్నల్ లేదా మరే ఇతర మాధ్యమంలో ప్రకటన లేదా వివాహానికి సంబంధించిన ఏదైనా ఆస్తి, డబ్బు లేదా వ్యాపారంలో వాటా అడిగినా, ఇచ్చినా ఆరు నెలల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష విధిస్తారు. దీనిని ఐదు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. సంబంధిత వ్యక్తికి రూ. 15,000 వరకు జరిమానా కూడా విధించవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్