Friday, September 12, 2025 03:24 PM
Friday, September 12, 2025 03:24 PM
roots

సాక్షికి లీగల్ నోటీసులు..!

సాక్షి టీవీ, సాక్షి పత్రికకు లీగల్ నోటీసులు అందాయి. నిరాధార వార్తలు ప్రసారం చేసినందుకు సాక్షి సంస్థకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు లీగల్ నోటీసులు పంపారు. ఈ నెల 10, 14వ తేదీల్లో తప్పుడు వార్తలు ప్రసారం చేసి తన ప్రతిష్ఠ దిగజార్చే కుట్ర చేసినందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా నిరాధార వార్తలు ప్రసారం చేసినందుకు సాక్షి టీవీ మాతృ సంస్థ ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ ప్రసారాలను నిలిపివేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా త్వరలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఫ్రీ బస్.. ఇందుకు కూడానా..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్ విధానం ద్వారా పూర్తి పారదర్శకంతో టీటీడీ విధులు నిర్వహిస్తోంది. భక్తులకు వసతి మొదలు.. అన్న ప్రసాదం అందించే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది టీటీడీ. నిత్యం 70 వేల మందికి పైగా భక్తులు ప్రస్తుతం స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తున్నప్పటికీ… సాధారణ భక్తులకే టీటీడీ పెద్ద పీట వేస్తోంది.

అయితే టీటీడీపై వైసీపీ నేతలు, అనుకూల మీడియా పదే పదే విమర్శలు చేస్తోంది. గోశాలలో ఆవులు చనిపోతున్నాయని… తొక్కిసలాటకు టీటీడీ నిర్లక్ష్యమే కారణమన.. భక్తులను పట్టించుకోవటం లేదని.. వీఐపీలో సేవలో తరిస్తున్న టీటీడీ అంటూ పదే పదే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది సాక్షి మీడియా. వీటిపై ఎప్పటికప్పుడు టీటీడీ వివరణ ఇస్తోంది కూడా. అయినా సరే.. సాక్షి పత్రిక మాత్రం.. అవే తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

శ్రీవారికి ప్రస్తుతం చైర్మన్ బీఆర్ నాయుడు అందిస్తున్న సేవలను కించపరిచే విధంగా సాక్షి మీడియా కుట్ర చేస్తోందని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ నాయుడు నోటీసులో తెలిపారు. టీటీడీకి 10 కోట్ల రూపాయలకు పరిహారం కింద చెల్లించాలని నోటీసులో స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోపు స్పందించకపోతే చట్టబద్ధమైన చర్యలుంటాయన్నారు. సాక్షి నెట్‌వర్క్ యజమాని వైఎస్ భారతీ రెడ్డితో పాటు.. సాక్షి సంస్థలో ఉన్నత ఉద్యోగులకు కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ ఉద్యోగుల్లో భయం మొదలైంది. సాక్షి సంస్థలో ఓ సీనియర్ ఉద్యోగి ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read : బ్రేకింగ్: సిఎంకు చెంప దెబ్బ.. ఢిల్లీలో సంచలనం..!

అయితే ఈ నోటీసులపై సాక్షి యాజమాన్యం స్పందించింది. ఉడుత ఊపులకు భయపడేది లేదని, పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై పోరాటం ఆగదని స్పష్టం చేసింది. నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు.. క్షమాపణ చెబితే.. చనిపోయిన వాళ్లు బతికొస్తారా.. అని బీఆర్ నాయుడు అన్నది నిజం కాదా.. అని ప్రశ్నించారు. తిరుమలలో దళారుల దందా పెరిగిపోయిందని.. ఏఐ టెక్నాలజీతో దర్శనాలు సాధ్యం కాదని తెలిసి కూడా.. రోజుల తరబడి భక్తులను క్యూ లైన్‌లో ఇబ్బంది పెడుతోంది నిజం కాదా.. అని సాక్షి ప్రశ్నించింది. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నదే మా డిమాండ్ అని.. పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచ

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్