Saturday, September 19, 2026 10:33 PM
Saturday, September 19, 2026 10:33 PM

‘వార్ 2’ లో ఎన్టీఆర్ విలనిజం పండలేదా..?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వైవిధ్యమైన పాత్రలు చేయాలని కోరుకుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలు అయితే తమ ఇమేజ్‌కి తగ్గట్టుగానే పాత్రలను ఎంచుకోవాల్సి వస్తుంది. అయితే విలన్ పాత్రలు చేసే సందర్భంలో మాత్రం నటులు తమ నటనను మరో స్థాయిలో ప్రదర్శించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవచ్చు. ఇటీవల విడుదలైన ‘వార్ 2’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో పాటు ఎన్టీఆర్ కూడా నటించాడు. ఇందులో ఆయన విలన్ పాత్ర పోషించాడు. కానీ ఆ పాత్రలో పెద్దగా స్కోప్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

Also Read: అక్కడ ఏం జరుగుతోంది..?

“సినిమాలో విలన్ ఉండాలి కాబట్టి పెట్టారు.. కానీ, ఎన్టీఆర్ లోని అసలైన విలనిజాన్ని చూపించలేదు” అంటూ చాలా మంది ఎన్టీఆర్ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ నటనపై ఎలాంటి సందేహం లేదు. ఆయనలోని విలనిజాన్ని బయటికి తీయగలిగితే అది ఓ లెజండరీ పాత్రగా నిలిచే అవకాశం ఉంది. ఇంతకు ముందు ‘జై లవకుశ’ సినిమాలో జై పాత్ర ద్వారా ఎన్టీఆర్ తనలోని నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా చూపించారు. ఆ సినిమాలో ఆయన నటనను చూసి ప్రేక్షకులు విపరీతంగా మెచ్చుకున్నారు. నెగటివ్ పాత్రలోని విలనిజాన్ని చూపిస్తూనే నటనతో ప్రేక్షకులని రంజింపచేసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

Also Read: మీరు మారేది ఎప్పుడు.. మార్పు రాదా..?

కానీ ‘వార్ 2’లో మాత్రం ఎన్టీఆర్‌కి దర్శకుడు తగినంత స్కోప్ ఇవ్వలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆయన కోసం మరింత స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసి ఉంటే సినిమా మరో లెవెల్‌కి వెళ్లేదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా “జై లవకుశలోని ఎన్టీఆర్‌ని ఒకసారి చూసేయ్.. ఆయన విలనిజం ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుస్తుంది” అంటూ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతుండగా, అభిమానులు మాత్రం భవిష్యత్తులో బాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్‌కి పవర్‌ఫుల్ విలన్ పాత్రలు రావాలని ఆశిస్తున్నారు. వారి ఆశలు నిజం అవ్వాలని, దర్శకులు మరింత అద్భుత పాత్రల్లో ఎన్టీఆర్ ని చూపిస్తారని ఆశిద్దాం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్