పులివెందుల నియోజకవర్గంలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల విషయంలో ప్రజాస్వామ్యవాదులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిందంటూ మండిపడుతున్నారు. కనీసం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు లేకుండా రిగ్గింగ్ చేశారని.. మంత్రులే స్వయంగా రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read : తమ్ముడు తమ్ముడే.. పదవి పదవే.. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య పదవి చిచ్చు
ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలే గాని ఇటువంటి చర్యలకు పాల్పడటం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఇదే ప్రజాస్వామ్యవాదులు సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. 2021 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైసీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని అప్పట్లో టిడిపి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సరే ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో వార్డులను ఏకగ్రీవం చేస్తున్న సరే సైలెంట్ గా నే ఉన్న ఈ ప్రజాస్వామ్యవాదులు.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికల్లో టూరిస్టులుగా దొంగ ఓటర్లను తీసుకొచ్చి.. ఓట్లు వేయించేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన చేష్టలు ఇంకా ఇప్పటికీ వీడియోల రూపంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ వాటి గురించి మాత్రం.. ప్రజాస్వామ్యవాదులు మాట్లాడిన పరిస్థితి ఎక్కడ కనబడలేదు. అప్పట్లో మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అరాచకాలకు పాల్పడిన సరే.. ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు చేసే చాలామంది సైలెంట్ గా ఉండిపోయారు.
Also Read : మోడీ రాజీనామా చేయాల్సిందే..? పట్టుబడుతున్న ఆర్ఎస్ఎస్..?
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో తురక కిషోర్ అతని తమ్ముడు చేసిన.. అక్రమాలు ఏ రేంజ్ లో ఉన్నాయో వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యవాదులు పెద్దగా బయటకు రాలేదు. కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా మాట్లాడతారంటూ టిడిపి కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో కనీసం నామినేషన్ వేయనీకుండా వైసిపి కార్యకర్తలు అంజిరెడ్డి అనే టిడిపి కార్యకర్తను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీని గురించి కూడా కనీసం ప్రజాస్వామ్యవాదులు మాట్లాడకపోవడం గమనార్హం.