ఎంతో ఆసక్తి రేపిన పులివెందుల, ఒంటిమిట్ట జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. రెండు రోజుల క్రితం హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ స్థానాన్ని అధికార తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకోవడంతో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మంత్రులు కూడా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు ఎన్నికలను పర్యవేక్షించడమే కాకుండా స్థానికంగా నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
Also Read: మోడీకి వెంకయ్యే పెద్ద దిక్కయ్యారా..?
అటు వైసీపీ కూడా ఈ ఎన్నికను సీరియస్ గానే తీసుకుంది. 30 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగటం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే అయినా.. వైయస్ జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఎలాగైనా సరే గెలవాలని ఎంపీ అవినాష్ రెడ్డి పట్టుదలగా ముందుకు వెళ్లారు. కానీ టిడిపి వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో వైసిపి ఓటమిపాలైంది. 2021 కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి చంద్రబాబును ఇబ్బంది పెట్టే రాజకీయం చేయడంతో ఇక్కడ టిడిపి తన మార్క్ రాజకీయం చేసింది. దీనితో వైసిపి అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు.
Also Read: జగన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. వాడు వీడు అంటూ విసుర్లు
పులివెందుల జిల్లా పరిషత్తు స్థానానికి టిడిపి ఇన్చార్జి బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేయగా.. 6800 ఓట్ల తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 680 ఓట్లు వచ్చాయి. దీంతో డిపాజిట్ కూడా దక్కలేదు. 30 ఏళ్ల తర్వాత జిల్లా పరిషత్తు స్థానాన్ని కైవసం చేసుకోవడంతో టిడిపి కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. 2017లో టిడిపి కడప జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ జిల్లా పరిషత్తు స్థానాన్ని కూడా కైవసం చేసుకుని వైఎస్ కుటుంబానికి షాక్ ఇచ్చింది.