వైసీపీ అధినేత వైయస్ జగన్ మాట్లాడే మాటలు కొన్నిసార్లు హాస్యాస్పదంగా ఉంటాయి అనే కామెంట్స్ మనం చూస్తూనే ఉంటాం. తాను చేసినవన్నీ కరెక్ట్ తన రాజకీయ ప్రత్యర్థులు చేసిన వారిని తప్పు అన్నట్లు జగన్ మాట్లాడుతూ ఉంటారు. తాజాగా పులివెందుల, ఒంటిమిట్ట జిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో జగన్ మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దొంగ ఓట్లు, రిగ్గింగ్, దౌర్జన్యం, ప్రజాస్వామ్యం కూని అనే మాటలు జగన్ మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు.
Also Read : బ్లూ మీడియాగా న్యూట్రల్ మీడియా.. గతం మరిచిందా..?
కానీ జగన్ లాంటి నాయకుడు చేయడమే ఆశ్చర్యం కలిగిస్తోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్.. పులివెందుల టిడిపి నేత బీటెక్ రవి పై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు. వాడు వీడు అంటూ మాట్లాడారు జగన్. ఇక పోలీస్ అధికారి కోయ ప్రవీణ్ విషయంలో కూడా జగన్ అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎవడైతే ఉన్నాడో కోయ ప్రవీణ్ అంటూ పోలీస్ అధికారిని అవమానించే విధంగా జగన్ మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది.
ఇక దొంగ ఓట్లు వేశారని, రిగ్గింగ్ కు పాల్పడ్డారని జగన్ మాట్లాడారు.. 2019లో జగన్ అధికారంలో వచ్చిన తర్వాత తిరుపతి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను పట్టుకున్నారు. కనీసం తండ్రి పేరు, ఇంటి అడ్రస్ తెలియని వందలాది మందిని పట్టుకుని బయటికి పంపించారు. టూరిస్టులుగా బస్సుల్లో తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించిన సంఘటనలు కూడా చూశాం. జగన్ వాటిని మర్చిపోవడం ఆశ్చర్యం కలిగించింది.
Also Read : అమెరికా టూర్ కు మోడీ.. ట్రంప్ తో భేటీ..?
ఇక ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకపోవడం.. పులివెందులలో 30 ఏళ్ల తర్వాత జిల్లా పరిషత్ ఎన్నిక జరగడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నట్లుగానే కనబడుతోంది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఆ ఫ్రస్టేషన్ తోనే వ్యక్తిగత వ్యాఖ్యలు చేసేందుకు జగన్ వెనకాడ లేదు. అసలు పులివెందులలో జరిగింది ఎన్నిక కాదు అని, బందిపోటుగా చంద్రబాబు వ్యవహరించారని జగన్ మండిపడ్డారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా టిడిపి కార్యకర్తలు లేదంటే ఇతర పార్టీల నాయకులు వేసే పరిస్థితి కనపడలేదు. వాటిని మర్చిపోయే జగన్ ఇప్పుడు తాను సుద్దపూస అన్నట్లు మాట్లాడుతున్నారని టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు.