Friday, September 12, 2025 06:39 PM
Friday, September 12, 2025 06:39 PM
roots

కృష్ణా నదికి వరద ఫుల్.. బెజవాడకు వర్షం నిల్..!

విజయవాడ ఎందుకు ఫేమస్ అంటే.. ప్రకాశం బ్యారేజ్, దుర్గమ్మ, కొండపల్లి గుహలు.. ఉలవచారు, పునుగులు, నెయ్యి ఇడ్లీ ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో మరొకటి యాడ్ అయింది. ఉక్కపోత.. బెజవాడ చుట్టూ వర్షాలు పడుతున్నా బెజవాడలో మాత్రం వర్షం జాడ లేదు. ఇటీవల రాజధాని అమరావతి ప్రాంతంలో వర్షం పడినా బెజవాడలో ఎండ అల్లాడించింది. నందిగామ, కంచికచర్లలో వర్షం పడినా బెజవాడలో ఉక్కపోతతో తుడుచుకోవడం సరిపోయింది.

Also Read : ఏపీ అడ్వకేట్ జనరల్ కు వైసీపీ లంచం.. లాయర్ సంచలన కామెంట్స్

బెజవాడకు మణిహారంగా ఉండే ప్రకాశం బ్యారేజ్ లో మాత్రం వేల క్యూసెక్కుల వరద సముద్రంలోకి వెళ్తోంది. కృష్ణా నది ప్రధాన ఉప నది మున్నేరుకు తెలంగాణా నుంచి భారీగా వరద వస్తోంది. బెజవాడకు చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో అన్ని చోట్ల వర్షాలు విస్తారంగా పడుతున్నా సరే.. బెజవాడలో మాత్రం ఆకాశంలో నల్లని మేఘం, ఇంట్లో ఏసీ కామన్ గా మారిపోయాయి. అప్పుడప్పుడు నల్లబడ్డట్టు కనపడుతోన్న మేఘాలు, వర్షించడానికి మాత్రం ఆస్తి చూపించడం లేదని బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : పాకిస్తాన్ ను ఓ ఆట ఆడేసాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

బెజవాడ మధ్య నుంచి ప్రవహించే ఏలూరు, బందరు కాలవల్లో నీరు పుష్కలంగా పొలాలకు వెళ్తోంది. ఆ నీటిని చూస్తున్న రైతులు.. వర్షాలు పడాలని ఆకాశానికి దండాలు పెడుతున్నారు. గత ఏడాది శ్రావణ శుక్రవారం సమయానికి భారీ వర్షాలు పడ్డాయి. ఈసారి మాత్రం అది కరువైంది. ఉపరితల ఆవర్తనం, రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అనడమే గాని.. బెజవాడకు మాత్రం చినుకు లేదు. అప్పుడప్పుడు పడినా.. మెరుపు తీగలా వచ్చి వెళ్తున్నాడు వరుణ దేవుడు. మరి బెజవాడపై ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్