Friday, September 12, 2025 07:04 PM
Friday, September 12, 2025 07:04 PM
roots

ట్రంప్ పై స్వదేశంలో తీవ్ర విమర్శలు.. భారత్ కు మద్దతుగా కామెంట్స్

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత, అనుసరిస్తున్న వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. మిత్ర దేశాలపై కూడా బెదిరింపు ధోరణితో ట్రంప్ సర్కార్ విధానాలు ఉన్నాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. తాజాగా భారత్ పై 50 శాతం సుంకాలు విధించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఈ విషయంలో ఆ దేశంలో సైతం విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రభావం కీలక ఒప్పందాలపై పడే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

Also Read : ఏపీ అడ్వకేట్ జనరల్ కు వైసీపీ లంచం.. లాయర్ సంచలన కామెంట్స్

దీనిపై డోనాల్డ్ ట్రంప్ మాజీ కార్యదర్శి జాన్ బోల్టన్ సంచలన కామెంట్స్ చేసారు. రష్యా, చైనాల నుండి భారతదేశాన్ని దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాదంలో పడేశారని, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదన్నారు. ఉక్రెయిన్‌ తో రష్యా చేస్తున్న యుద్దానికి భారత్ మద్దతు ఇస్తుందని ఆరోపిస్తూ ట్రంప్ సుంకాలు విధించారు. చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా ఆ దేశానికి మాత్రం సుంకాలు విధించలేదు ట్రంప్.

Also Read : ఖబడ్డార్ కేటీఆర్.. తడాఖా చూపిస్తాం.. కమ్మ సంఘాల హెచ్చరిక

అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు, అమెరికా మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ పాడిల్లా కూడా ఈ సుంకాలను తప్పుబట్టారు. భారత్-అమెరికా సంబంధాలకు దీర్ఘకాలిక నష్టం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సుంకాలు అమెరికాపై నమ్మకాన్ని మరింతగా పోగొట్టే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ విషయంలో భారత్ కు వెనక్కు తగ్గడం లేదు. అమెరికాతో చేసుకున్న జెట్ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసింది భారత్. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు రద్దు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్