Saturday, October 25, 2025 07:55 PM
Saturday, October 25, 2025 07:55 PM
roots

రాఖీ పండుగ ప్రత్యేకత.. పాటించాల్సిన నియమాలు ఇవే..!

శ్రావణ మాసం వస్తుందంటే, పండుగల సందడి మొదలవుతుంది. ఈ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రక్షాబంధన్ (రాఖీ పండుగ) ఒకటి. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 9న జరగనుంది. ఇప్పటికే సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎంతో ప్రేమతో, స్నేహంతో, కొన్నిసార్లు దూర ప్రాంతాల నుంచే వచ్చి సోదరులను కలిసి రాఖీ కడుతున్నారు.

ఈ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని బలపరిచే ప్రత్యేక సందర్భం. పండితుల మాటల ప్రకారం, ఈ పండుగను కొన్ని నియమాలు పాటిస్తూ జరుపుకుంటే జీవితాంతం ఆనందం మరియు ఐక్యత కలిగి ఉండే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇప్పుడు వాటిలో ముఖ్యమైన నియమాలను ఒకసారి చూద్దాం:

Also Read : ఎమ్మెల్యేలకు బాబు షాక్..!

రాఖీ ఎంపికలో జాగ్రత్తలు:
బజార్లలో ఈ రోజుల్లో విభిన్నమైన రంగులు, డిజైన్లలో రాఖీలు లభిస్తున్నాయి. అయితే, గుడ్డిగా రాఖీలు ఎంపిక చేయకుండా కొన్ని విషయాలు గమనించాలి. ముఖ్యంగా దేవుళ్ల చిత్రాలు ఉన్న రాఖీలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే, అలాంటి రాఖీ కట్టుకున్న చేతితో చేయకూడని పనులు చేస్తే అపశకునం జరిగే అవకాశముంటుందని నమ్మకం ఉంది. కాబట్టి సాధారణ డిజైన్‌లతో రాఖీలను ఎంచుకోవడం ఉత్తమం.

రాశి ప్రకారం రంగుల రాఖీలు:
అలాగే కొన్ని రాశుల వారికి కొన్ని రకాల రంగుల రాఖీలు కట్టడం వల్ల మరింత మంచి జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు తమ సోదరుడిది ఏ రాశినో తెలుసుకొని వారికి అనుకూలంగా ఉండే రంగు రాఖీలను తీసుకోవాలని చెబుతున్నారు. కొన్ని రాశులకు అనుకూలంగా సూచించే రంగులు ఇలా ఉన్నాయి:

మేష రాశి – ఎరుపు

వృషభ రాశి – నీలం

మిథునం, కన్య – ఆకుపచ్చ

కర్కాటకం – తెలుపు

సింహం – ఆరెంజ్

తుల – తెలుపు లేదా లైట్ బ్లూ

వృశ్చికం – ఎరుపు

ధనుస్సు – పసుపు

మకరం, కుంభం – నీలం

మీనం – పసుపు

Also Read : ఓటర్ బాంబు పేల్చిన రాహుల్.. సంచలన లెక్కలు రిలీజ్

రాఖీ కట్టే సమయంలో పాటించాల్సిన విధానం:
పండితులు సూచించేది ఏమంటే, రాఖీ కట్టేటప్పుడు సోదరుడు తూర్పు లేదా ఉత్తర దిశలో కూర్చోవాలి. రాఖీ కడుతున్న సోదరి ఆభిముఖంగా ఉండాలి. దేవుడి గది సమీపంలోనే ఈ కార్యక్రమం జరగడం మానసిక శాంతిని, దైవ అనుగ్రహాన్ని అందిస్తుందని చెబుతున్నారు.

ఈ రోజు సోదరీమణులు పుట్టింటికి వచ్చి కుటుంబంలో సంతోషాన్ని నింపుతారు. ఇలాంటి సందర్భాల్లో ఇంట్లో శుభ వాతావరణం ఏర్పడేలా చూసుకోవాలి. అప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య జీవితాంతం ఐక్యత, ప్రేమ పెరిగి, సంబంధం మరింత బలపడుతుందని నమ్మకం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్