Thursday, September 11, 2025 12:41 PM
Thursday, September 11, 2025 12:41 PM
roots

యాపిల్ భారత్ లోనే ఉంటుంది.. ట్రంప్ కు టిమ్ కుక్ షాక్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్ పై 25 శాతం సుంకాలు విధించడంతో, భారత్ లో ఉన్న అమెరికా సంస్థలపై ప్రభావం పడే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. యాపిల్ వంటి సంస్థలు మన దేశాన్ని వీడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు చేసారు. గత మూడు నాలుగు నెలలుగా టీం కుక్ ను ట్రంప్ బెదిరిస్తూ వచ్చారు. భారత్ లో పెట్టుబడుల విషయంలో వెనక్కు తగ్గాలని హెచ్చరించినా.. యాపిక్ మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయలేదు.

Also Read : మరో 10 రోజులే సమయం..!

ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్, స్మార్ట్ ఫోన్ లపై 25 శాతం సుంకాలు లేకపోయినా భవిష్యత్తులో మాత్రం అలా ఉండకపోవచ్చు అని భావిస్తున్నారు. దీనిపై టిమ్ కుక్ మాట్లాడుతూ.. భారతదేశంలో పెట్టుబడి ప్రణాళికలు చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఏ నిర్ణయాల ప్రభావం తమ ప్రణాళికపై పడదు అని స్పష్టం చేసారు. త్రైమాసిక ఫలితాల తర్వాత, ఎటువంటి మార్పు రాలేదని కామెంట్ చేసారు. అమెరికా మార్కెట్ కు సరిపడా ఐఫోన్ లను భారత్ ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ టారిఫ్ ల ప్రభావం దీని పై పడినట్లు లేదని అర్ధం అవుతుంది.

Also Read : గల్లా రాజకీయ రీఎంట్రీ కి రంగం సిద్ధం..!

అమెరికా డిమాండ్ కు తగ్గట్టుగా.. మాక్‌బుక్స్, ఐప్యాడ్‌లు, ఆపిల్ వాచీలు వంటి ఆపిల్ ఉత్పత్తులకు వియత్నాం ప్రాథమిక తయారీదారుగా ఉంటుందని వెల్లడించారు. ఇతర దేశాల డిమాండ్ లకు తగ్గట్టుగా చైనాలో ఉత్పత్తులు చేస్తామన్నారు. భారత్, మిడిల్ ఈస్ట్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఆపిల్ రెండంకెల వృద్ధిని సాధించిందని టిమ్ కుక్ వెల్లడించారు. జూన్ త్రైమాసికంలో ఆపిల్ భారీ ఆదాయాన్ని నమోదు చేసిన 25 దేశాలలో భారత్ కూడా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ఆపిల్ త్రైమాసిక ఆదాయాలు 10 శాతం పెరిగి 94 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

అనిమిని దెబ్బకు సైలెంట్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి ఆర్కే...

ఏదైనా బావిలో దూకి...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

పోల్స్