Friday, September 12, 2025 08:17 AM
Friday, September 12, 2025 08:17 AM
roots

సైబర్ నేరాలు ఏ రేంజ్ లో జరిగాయో తెలుసా..? లెక్క చూస్తే మైండ్ బ్లాక్

గత మూడు నాలుగేళ్ళుగా సైబర్ మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్, కస్టమ్స్ అంటూ మోసగాళ్ళు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోంది. అసలు సైబర్ మోసాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో తాజాగా.. ఢిల్లీకి చెందిన ఓ మీడియా, టెక్ కంపెనీ డేటా లీడ్స్ ఓ లెక్క విడుదల చేసింది. 2024లో సైబర్ నేరస్థులు, మోసగాళ్ల కారణంగా భారత పౌరులు రూ.22,842 కోట్లు కోల్పోయారు అని వెల్లడించింది.

Also Read : మరో 10 రోజులే సమయం..!

ఇక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, I4C, ఈ సంవత్సరం భారతీయులు రూ. 1.2 లక్షల కోట్లకు పైగా నష్టపోతారని అంచనా వేసింది. 2023లో రూ.7,465 కోట్ల రూపాయలను కోల్పోగా.. ఈ గత ఏడాది ఆ నష్టం మూడు రెట్లు పెరిగింది. ఇక 2022లో రూ.2,306 కోట్ల రూపాయలు కోల్పోయారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగాయి. 2024 లో దాదాపు ఇరవై లక్షలు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 15.6 లక్షల వరకు నమోదు అయ్యాయి.

Also Read : ది బెస్ట్ టెస్ట్ మ్యాచ్.. హైదరాబాద్ నవాబ్ చాంపియన్ ఆట..!

డిజిటల్ చెల్లింపు విధానాల వినియోగం పెరగడంతోనే ఈ స్థాయిలో మోసాలు పెరిగాయని భావిస్తున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్ నేరాల కారణంగా భారీగా నష్టపోతోంది భారత్. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2025/26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆర్ధిక మోసాలు దాదాపు ఎనిమిది రెట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదించింది. బ్యాంకు సంబంధిత మోసాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 60 శాతం ప్రైవేట్ రంగ బ్యాంకులే లక్ష్యంగా జరిగాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్