వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పులివెందుల నియోజకవర్గంలో వాతావరణం చాలా మారింది. రాజకీయంగా జగన్ ఎంత బలంగా ఉన్నా సరే పులివెందులలో తాను నమ్మినవారికి బాధ్యతలు అప్పగించి ఎక్కువగా రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. అధికారంలో ఉన్న సమయంలో, లేని సమయంలో కూడా జగన్ అలాగే రాజకీయం చేశారు. దీనిపై పులివెందుల నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చిన సరే జగన్ వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. 2014 తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల కంటే కూడా.. వైయస్ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం పులివెందుల నియోజకవర్గంలో ఎక్కువగా పెరిగింది.
Also Read : యాషెస్ లో చుక్కలు చూపిస్తాం.. ఇంగ్లాండ్ కు ఆసిస్ స్ట్రాంగ్ వార్నింగ్
దీనిపై విమర్శలు వచ్చినా సరే వైసీపీ అధిష్టానం జాగ్రత్తలు తీసుకోలేదు. వివేకానంద రెడ్డి ముందు పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు చూసేవారు. ఆ తర్వాత జగన్ భాస్కర్ రెడ్డి లేదా అవినాష్ రెడ్డిని అక్కడ నియమిస్తూ వచ్చారు.. అవినాష్ రెడ్డి విషయంలో విమర్శలు రావడంతో ఇప్పుడు సతీష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. టిడిపి నుంచి వైసీపీలో జాయిన్ అయిన సతీష్ రెడ్డి.. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీకి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. దీనిపై నియోజకవర్గ స్థాయి నాయకుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతూ వస్తోంది. నియంత మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని తమ సమస్యలను జగన్ దృష్టికి వెళ్ళనీయడం లేదని అక్కడి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
Also Read : టీడీపీ బాటలోనే జగన్..!
ఇక తాజాగా జగన్ వద్దకు వెళ్లేందుకు పులివెందుల నియోజకవర్గ నాయకులు సిద్ధమైనట్లు సమాచారం. అవసరమైతే నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేసి అయినా సరే సతీష్ రెడ్డిని పక్కన పెట్టించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మండలాలతో పాటుగా గ్రామాల్లో కూడా గ్రూపు రాజకీయాలను సతీష్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు అనేది అక్కడ నాయకుల ఆగ్రహం. తనకు అనుకూలంగా ఉండే వారికే సతీష్ రెడ్డి మద్దతు పలుకుతున్నారని.. లేనిపక్షంలో వారిని పక్కన పెడుతున్నారని.. ఈ విషయంలో పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డ వారు ఇబ్బందులు పడుతున్నట్లు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు టిడిపి నుంచి వచ్చిన వారికి సతీష్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సతీష్ రెడ్డి వైఖరి కారణంగా వైసిపి పట్టు కొన్ని గ్రామాల్లో కోల్పోయిందని.. భవిష్యత్తులో ఇలాగే జరిగితే ఎమ్మెల్యే సీటు ఓడిపోయిన ఆశ్చర్యం లేదంటూ మండల స్థాయి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారని.. ఇప్పుడు కూడా అధిష్టానం చర్యలకు దిగకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలు ఉండే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.