Friday, September 12, 2025 02:46 PM
Friday, September 12, 2025 02:46 PM
roots

అనంతబాబుకు సహకరించింది ఎవరు..? సిట్ విచారణలో సంచలనాలు..!

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సంచలనంగా మారిన కేసుల్లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఘటన ఒకటి. ఈ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబుకు శిక్ష పడటం ఖాయమని భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇక ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ప్రారంభం అయింది. కేసు పూర్వాపరాలు తేల్చి, బాధితులకు న్యాయం చేసే విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నారు.

Also Read : దొరికిపోయిన కొలికపూడి.. ఇప్పుడు కవరింగ్..!

2022 మేలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఘటన జరిగింది. అతనిని అనంతబాబు డోర్ డెలివరి చేసారు. అనంతబాబును వెనుకుసుకుని వచ్చిన నాటి మఖ్యమంత్రి జగన్ దెబ్బతో అధికారులు ఈ కేసులో ముందుకు వెళ్ళలేదు. ఈ ఘటన, డెడ్ బాడీ డోర్ డెలివరీపై నాడు రాష్ట్ర వ్యాప్త చర్చ జరిగింది. దీనిపై అప్పుడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మృతుడి తల్లి ఫిర్యాదుపై తదుపరి చర్యలకు సిద్దమయ్యారు. కేసుపై లోతైన విచారణ చేయడంతోపాటు 90 రోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును న్యాయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. గతంలో విచారణలో లోపాలను గుర్తించి….90 రోజుల్లో పూర్తి విచారణ పూర్తి చేసే దిశగా సిట్ ప్రయత్నం చేస్తోంది. అనంతబాబుకు నాడు గన్ మెన్లుగా ఉన్న వారిని విచారించిన సిట్…నాడు ఏం జరిగింది.. ఘటనలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై అన్ని కోణాల్లో విచారణ చేస్తోంది. ఒక్కడే హత్య చేసి, డెడ్ బాడీని తరలించే అవకాశం లేదని…సహకరించిన వారు ఎవరనేది తేల్చనుంది.

Also Read : భయపెడుతున్న పంత్.. సీరీస్ లో కష్టమేనా..?

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చట్టబద్దంగా బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారం, ఆర్థిక సాయం అందించింది. ఎస్సీలపై జరిగిన నేరాల విషయంలో బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన పింఛను పెండింగ్ తో సహా కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది. కుటుంబ సభ్యులకు పింఛన్ తో పాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడుకి సోషల్ వెల్ఫేర్ శాఖలో ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం.. మరోవైపు సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం అనువైన చోట 3 సెంట్ల ఇంటి స్థలం, 2 ఎకరాల సాగుభూమి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్