రిషబ్ పంత్.. అంతర్జాతీయ క్రికెట్ లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్. అందరూ పొట్టి ఫార్మాట్ లో అలరిస్తుంటే.. ఈ బుడ్డి వికెట్ కీపర్ మాత్రం టెస్ట్ క్రికెట్ లో కావాల్సినంత వినోదం పంచుతూ ఉంటాడు. బ్యాటింగ్ చేస్తుంటే ఎన్నో విన్యాసాలు. షూ జారిపోవడం, బ్యాట్ వదిలేయడం, కింద పడిపోవడం ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఇక వికెట్ కీపర్ గా కూడా అతని మాటలు వినే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. జట్టులో స్ఫూర్తి నింపడానికి నిత్యం ఏదోక కామెంట్ చేస్తూ, కామెడి చేస్తూ ఉంటాడు.
Also Read : HCA రోత పనులు.. బంతుల్లో కూడా కక్కుర్తి
అలాంటి పంత్ ఇప్పుడు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సీరీస్ లో రెండు సెంచరీలు రెండు అర్ధ సెంచరీలతో దూకుడు మీదున్న ఈ ఢిల్లీ ఆటగాడు.. మూడవ టెస్ట్ మొదటి రోజు కీపింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆ గాయంతోనే మూడవ టెస్ట్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు పంత్. అయితే పంత్ గాయం ఇప్పుడు భారత శిభిరాన్ని కలవరపెడుతోంది. అతన్ని ఆడించాలా వద్దా అనేది అర్ధం కావడం లేదు. పంత్ జట్టులో అత్యంత కీలక ఆటగాడు. ఈ సీరీస్ లో విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు.
Also Read : పవన్ సంచలన నిర్ణయం.. రెండు రాష్ట్రాల్లో జనసేన సర్వేలు
అందుకే ఇప్పుడు పంత్ ను పక్కన పెట్టాలా లేదా అనేది కెప్టెన్ గిల్ కు అర్ధం కావడం లేదు. అతనిని ఎలాగైనా జట్టులో ఉంచాలనేది గిల్ తపన. దీనితో అతని స్థానంలో ద్రువ్ జూరెల్ ను కీపర్ గా తీసుకుని, పంత్ ను బ్యాటర్ గా తీసుకోవాలని భావిస్తున్నాడు గిల్. పంత్ జట్టులో కావాలి కాబట్టి.. మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్ ను పక్కన పెట్టాలనే డిమాండ్ వినపడుతోంది. దీనితో నాయర్ స్థానంలో జూరెల్ ను ఆడించి, పంత్ ను బ్యాటర్ గా తీసుకుంటే మంచిదని భావిస్తున్నాడు.