Friday, September 12, 2025 08:54 PM
Friday, September 12, 2025 08:54 PM
roots

ఆర్సీబీకి షాక్ ఇచ్చిన కన్నడ సర్కార్

తొలిసారి ఐపిఎల్ గెలిచిన ఆర్సీబీ జట్టుకు కర్ణాటక ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఆ జట్టుపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్దమైంది. జస్టిస్ మైఖేల్ డి’కున్హా కమిషన్ సమర్పించిన తుది నివేదికను పరిశీలిచిన అనంతరం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూలై 11న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించిన జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటారు.

Also Read  : బ్రిటన్ ను భయపెడుతోన్న పురాతన వ్యాధి.. వణికిపోతున్న గవర్నమెంట్

జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈవెంట్ నిర్వాహకులు డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసులు ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని నివేదికలో పేర్కొన్నారు. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. అంత మందిని హ్యాండిల్ చేయడం కష్టమని తెలిసినా సరే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారని కమీషన్ తన నివేదికలో స్పష్టం చేసింది.

Also Read  : సింగరేణిలో కవితకు షాక్ ఇవ్వడానికి కారణం ఇదేనా..?

విధి నిర్వహణలో పోలీసులు, యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చూపించారు అంటూ పేర్కొంది. మధ్యాహ్నం 3.25 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగిందని, ఆ సమయంలో క్రికెటర్లు అందరూ అక్కడే ఉన్నారని తెలిపింది. విచారణ కమీషన్.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిచింది. అలాగే అక్కడ గాయపడిన వారితో కూడా మాట్లాడింది. స్టేడియం లోపల కేవలం 79 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. బయట అసలు పోలీసులు ఎవరూ లేరని కమీషన్ తన నివేదికలో వెల్లడించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్