Friday, September 12, 2025 10:14 PM
Friday, September 12, 2025 10:14 PM
roots

కల్వకుంట్ల కవిత గుస్సా.. ఎవరిపైన..?

ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలతో కవితకు కంచం పొత్తా – మంచం పొత్తా అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. ఇక తెలంగామ జాగృతి కార్యకర్తలు, కవిత అనుచరులు తీన్మార్ మల్లన్నకు చెందిన Q tv కార్యాలయంపై దాడి చేశారు. కవిత అనుచరుల దాడిలో మల్లన కూడా గాయపడ్డారు. మల్లన్న గన్ మెన్ గాలిల్లోకి 6 రౌండ్లు కాల్పులు కూడా జరిపారు.

Also Read : మేము లోంగిపోతాం.. మావోయిస్ట్ పార్టీ అగ్ర నేతల సమాచారం

ఇక తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా కవిత ఫిర్యాదు చేశారు. తన జోలికి వస్తే.. తన అనుచరులు చూస్తూ ఉంటారా అని కూడా కవిత వ్యాఖ్యానించారు. అయితే తీన్మార్ మల్లన్న వ్యవహారంలో కవిత ఒంటరి అయిపోయారనే కామెంట్లు కూడా ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి. కవితపై మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌కు చెందిన ఒక్క నేత కూడా స్పందించలేదు. ఇక కవిత సొంత అన్న కేటీఆర్ అయితే కనీసం సోషల్ మీడియాలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. వాస్తవానికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న కేటీఆర్.. సొంత చెల్లి విషయంలో మాత్రం.. కనీసం నోరెత్తలేదు. దీంతో కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు తనకు అండగా ఉన్నారని… కానీ సొంత పార్టీ మాత్రం కనీసం తనను పట్టించుకోలేదన్నారు.

Also Read : మళ్లీ మళ్లీ.. అదే పాత పాట..!

తీన్మార్ మల్లన్న Q tv కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి, అనంతర ఘటనలను అన్ని మీడియాల్లో ప్రముఖంగా కవర్ చేశాయి. కానీ బీఆర్ఎస్ సొంత మీడియా నమస్తే తెలంగాణ, టీ న్యూస్ మాత్రం ఆ న్యూస్ కవర్ చేయలేదు. పత్రికలో కనీసం చిన్న వార్త కూడా రాలేదు. తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్లను టీపీసీసీ చీఫ్ మహేష్ యాదవ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా తప్పుబట్టారు. మల్లన్న తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ సొంత పార్టీ బీఆర్ఎస్ మాత్రం కవిత విషయాన్ని ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. ఇదే కవిత ఆగ్రహానికి అసలు కారణం కూడా.

Also Read : సింగరేణిలో కవితకు షాక్ ఇవ్వడానికి కారణం ఇదేనా..?

మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని కోరిన కవిత.. వెంటనే మలన్న సభ్యత్వం రద్దు చేయాలని కూడా కోరారు. అలాగే మల్లన్నపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన వారిపై కాల్పులు జరిపి చంపేస్తారా అని కవిత నిలదీశారు కూడా. తనను అగౌరవ పరిచిన మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్నారు. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెస్స్ సరైనదే అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కితాబిచ్చారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించడం తప్పని కూడా కవిత వ్యాఖ్యానించారు. నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌కు తాను మద్దతిచ్చినట్లు చెప్పిన కవిత.. బీఆర్ఎస్ నేతలు కూడా తన దారికి రావాల్సిందే అని స్పష్టం చేశారు. తన పోరాటం ఫలితంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అవకాశం వచ్చిందన్నారు కవిత.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్