భారత్ తో పాటుగా పలు దేశాల్లో భూకంపాలు కంగారు పెడుతున్నాయి. కొన్ని రోజుల నుంచి ఆసియా దేశాలను మాత్రమే కలవరపెడుతున్న భూకంపాలు ఇప్పుడు అమెరికాను సైతం వణికించాయి. తాజాగా అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. అమెరికాలోని అలాస్కా తీరంలో బుధవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని, దీనితో సునామీ హెచ్చరిక జారీ చేసామని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అమెరికా కాల మానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటలకు భూకంపం సంభవించింది.
Also Read : బ్రిటన్ ను భయపెడుతోన్న పురాతన వ్యాధి.. వణికిపోతున్న గవర్నమెంట్
దీని కేంద్రం ఐలాండ్ సిటీ సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 54 మైళ్లు (87 కిలోమీటర్లు) దూరంలో ఉందని వెల్లడించారు. భూకంప కేంద్రం 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు తేల్చారు. భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం, అలాస్కాలోని కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్‌కు 40 మైళ్లు దక్షిణాన) నుండి అలాస్కాలోని యూనిమాక్ పాస్ (ఉనలస్కాకు 80 మైళ్లు) వరకు పసిఫిక్ తీరాలకు ఈ హెచ్చరిక జారీ చేసామని అధికారులు వెల్లడించారు.
Also Read : మళ్లీ మళ్లీ.. అదే పాత పాట..!
దూర ప్రాంతాలకు పెద్దగా సునామి ప్రమాదం లేకపోవచ్చు అని వెల్లడించారు. మార్చి 1964లో ఈ ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపం. ఆ సమయంలో ఆంకరేజ్ నగరాన్ని పూర్తిగా నాశనం చేసింది. అలాస్కా గల్ఫ్, అమెరికా పశ్చిమ తీరం, హవాయిలను సునామీ ముంచెత్తింది. జూలై 2023లో అలాస్కాన్ ద్వీపకల్పంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది, కాని ఆ ప్రకంపనల తర్వాత పెద్దగా నష్టం వాటిల్లలేదు.