Saturday, September 13, 2025 02:19 AM
Saturday, September 13, 2025 02:19 AM
roots

బ్రిటన్ ను భయపెడుతోన్న పురాతన వ్యాధి.. వణికిపోతున్న గవర్నమెంట్

ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఏదోక వ్యాధి ప్రపంచాన్ని వేధిస్తూనే ఉంటుంది. తాజాగా బ్రిటన్ ను ఓ పురాతన వ్యాధి వణికిస్తోంది. అక్కడి ప్రభుత్వం కూడా దీని విషయంలో అలెర్ట్ అయి.. పెద్ద ఎత్తున వైద్య సేవలను విస్తరిస్తోంది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ నుండి విడుదలైన ఓ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంగ్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో టైఫాయిడ్, పారాటైఫాయిడ్ జ్వరం కేసులు భారీగా పెరుగుతున్నాయని బయటపెట్టింది. తాత్కాలిక డేటా ప్రకారం, 2024లో 702 కేసులు నమోదయ్యాయి.

Also Read : ఆ విషయంలో జగన్ స్టాండ్ ఏమిటో..?

2023 తో పోలిస్తే గత ఏడాది 8% భారీగా ఈ కేసులు నమోదు అయ్యాయి. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధులు కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తాయి. ఎక్కువగా విదేశాలలోనే ఈ వ్యాధులు వ్యాపిస్తాయత. ఆ డేటాలో మరో సంచలన విషయం బయటపెట్టారు. పాకిస్తాన్, యూకేలో ఔషదాలతో నయం కాని టైఫాయిడ్ పెరుగుతోందట. దీని కారణంగా చికిత్స సవాల్ గా మారి మరణాలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఇండియన్ సినిమాపై ఇరాన్ స్పెషల్ లవ్.. న్యూస్ పేపర్ లో స్పెషల్ ఆర్టికల్

ఈ ఏడాది ఇప్పటి వరకు యూకేలో దాదాపు 1200 కేసులు నమోదు అయ్యాయి. ప్రతి సంవత్సరం 13 మిలియన్ల టైఫాయిడ్, పారాటైఫాయిడ్ ఏ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. ప్రతీ ఏటా దీని కారణంగా 1,33,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసియాలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో దీని గురించి ఆందోళన లేకపోయినా.. యూకే వంటి దేశాల్లో మాత్రం భయం మొదలైంది. చిన్న పిల్లలకు అత్యంత వేగంగా ఈ వ్యాధి ప్రమాదకారిగా మారే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్