Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

గంటకో బులిటెన్ వేసినా జనం నమ్మరు: ధూళిపాళ్ళ ఇంట్రస్టింగ్ కామెంట్స్

గత కొన్నాళ్ళుగా పొన్నూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు, తనపై వైసీపీ ఇంచార్జ్ అంబటి మురళి చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ క్లారిటీ ఇచ్చారు. పూటకో స్క్రిప్ట్ చదివినా, గంటకో బులిటన్ వేసినా ప్రజలు విశ్వసించరని సాక్షి మీడియాపై కూడా మండిపడ్డారు ధూళిపాళ్ళ. నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకమని స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఐదేళ్ల అరాచకానికి జగన్ మోహన్ రెడ్డే సూత్రధారి అని మండిపడ్డారు. పొన్నూరు లాంటి ప్రశాంత పల్లెల్లో రక్తపు కత్తులు తిప్పింది వైసిపి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

Also Read : భారత్ లో అడుగు పెడుతున్నాం.. ట్రంప్ సంచలన ప్రకటన

గుంటూరు దళిత విద్యార్థిని రమ్యను పట్టపగలు హత్యచేసినపుడు అంబటి బ్రదర్స్ నోళ్ళు తెరవలేదని.. తాడేపల్లి ప్యాలెస్ కూతవేటు దూరంలో దళిత మహిళ మీద సామూహిక అత్యాచారం జరిగితే జగన్ చలించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ దళితనేత బండ్లమూడి బాబురావు మీద అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడితే వైసిపి దళిత సంఘాలు కినుక వహించాయన్నారు. రేషన్ మాఫియా పొన్నూరు దళితుడు బర్నాబాస్ ను అత్యంత దారుణంగా హత్యచేస్తే బాధిత కుటుంబం తరపున మేము పోరాటం చేస్తే వైసిపి ప్రభుత్వం స్పందించలేదన్నారు.

Also Read : శుభాన్షు శుక్లా శరీరంలో వచ్చే మార్పులు ఇవే..!

పాత కక్షలు, వ్యక్తుల మధ్య ఘర్షణను దాడిగా చిత్రీకరించి మా మీద బురద చల్లాలనే ప్రయత్నం రోజు వారిగా చేస్తున్నారన్నారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా ముద్దాయిలను అరెస్ట్ చేసి 307 కేసు నమోదు చేసి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారని, హత్యా రాజకీయాలు, ప్యాక్షన్ రాజకీయాలు జగన్ మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. తన నైజాన్ని పార్టీ శ్రేణులందరికీ అలవాటు చేశాడు జగన్ అంటూ విమర్శించారు. వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయ క్లర్క్ రాసిన ఉత్తరాలు చదవటం ఆ పార్టీ నాయకుల వంతు, గంట గంటకు బులిటెన్లు చేయటం వైసిపి మీడియా తంతు అని మండిపడ్డారు.

Also Read : భారత్ లో అడుగు పెడుతున్నాం.. ట్రంప్ సంచలన ప్రకటన

నాటి రాజశేఖర్ రెడ్డి ఆయన గ్యాంగ్ నుండీ నేటి జగన్ మోహన్ రెడ్డి తన చెంచాల వరకు నాపైన ఆరోపణలు చేసిన వాళ్ళే, ఎన్ని పాబ్రికేటేడ్ కేసులు పెట్టినా సత్యమే గెలుస్తుంది, సత్యం గెలిచిందని చెప్పేందుకు నా ప్రజా ప్రస్తానమే నిదర్శనమన్నారు. నా ప్రాంతానికి, నా ప్రజలకు నా జీవిత ప్రయాణం తెరిచిన పుస్తకమని స్పష్టం చేసారు. వాస్తవాలు, కథనాలు, కథలు అన్నీ మా ప్రజలకు పూర్తి అవగాహన ఉందన్న ఆయన.. మీ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో కుటుంబ రాజకీయ ప్రస్థానంకి ఈ ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని చెరపలేవని మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్