Friday, September 12, 2025 11:04 PM
Friday, September 12, 2025 11:04 PM
roots

శుభాన్షు శుక్లా శరీరంలో వచ్చే మార్పులు ఇవే..!

సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం తర్వాత జనాల్లో అంతరిక్ష ప్రయాణాల గురించి ఆసక్తి పెరిగిపోయింది. అసలు వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు, ఏం తింటారు, ఏం తాగుతారు, కాల కృత్యాల సంగతి ఏంటీ వంటి విషయాల గురించి తెలుసుకోవడానికి కష్టపడుతున్నారు. లేటెస్ట్ గా భారత్ కు చెందిన శుభాన్షు శుక్లా.. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు వెళ్లి వచ్చాడు. ఓ మిషన్ లో భాగంగా నాసా.. శుక్లాను అక్కడికి పంపింది. విజయవంతంగా అతను తిరిగి భూమి మీదకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : చంద్రబాబుతో భేటీకి రేవంత్ నో..!

మరి అతను భూమి మీదకు వస్తే శరీరంలో వచ్చే మార్పులు ఏంటో ఒకసారి చూద్దాం. వారి జీవితం అంత సులభంగా ఉండదు అనేది నిపుణుల మాట. శరీరం సున్నా గురుత్వాకర్షణ శక్తికి వెళ్ళిన తర్వాత చాలా మార్పులకు లోనవుతుంది. శుభాంషు శుక్లా 18 రోజులు సున్నా గురుత్వాకర్షణ శక్తిలో గడిపిన తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు, శరీరం.. పెరిగిన గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా మార్పులు చేసుకుంటుంది. అందుకే అతనికి తల తిరుగుతూ ఉంటుంది. వికారంగా కూడా ఉంటుందట.

Also Read : స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ..!

శరీరం యొక్క దిగువ భాగాలలో రక్తం పేరుకుపోవడంతో, వ్యోమగామి నిలబడటం కష్టంగా ఉంటుంది. ప్రయత్నం చేస్తే పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కాప్సుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతరులు తీసుకు వెళ్తారు. చెవి యొక్క వెస్టిబ్యులర్ వ్యవస్థలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి భూమి మీదకు వచ్చిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత, శుభాంషు శుక్లా గుండె మరియు రక్త నాళాలు ఓవర్ టైం పని చేయాల్సి ఉంటుంది. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తం పంపింగ్ ఉంటుంది.

Also Read : కోహ్లీ బాటలోనే రోహిత్.. లండన్ పయనం అవుతున్నాడా..?

ఇది గుండె సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఎముకలు ఎక్కువగా బలహీనపడతాయి. శరీరం నిలబడే అవకాశం ఉండదు కాబట్టి ముఖ్యంగా కాళ్ళ ఎముకలపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. దీనితో కాళ్ళను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే విధంగా అతను కష్టపడాలి. అంతరిక్షంలో ఉన్న సమయంలో రోగ నిరోధక వ్యవస్థ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అందుకే వైద్యులు నిరంతరం వ్యోమగాములను పరీక్షిస్తూ ఉంటారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్