Friday, September 12, 2025 10:37 PM
Friday, September 12, 2025 10:37 PM
roots

విమానం కంటే వేగవంతమైన రైలు.. చైనా సంచలనం

పలు రంగాల్లో ఆవిష్కరణలు చేసే విషయంలో చైనా, జపాన్ దేశాలు ముందు ఉంటాయి. ముఖ్యంగా రవాణా రంగంలో ఈ దేశాలు కీలక అడుగులు వేస్తూ ఉంటాయి. రైల్వే వ్యవస్థలో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేసేందుకు సిద్దంగా ఉంటాయి. తాజాగా చైనా కీలక అడుగు వేసింది. విమానం కంటే వేగవంతమైన రైలును పరీక్షించింది. కొత్త హై-స్పీడ్ మాగ్లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) రైలును విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. గంటకు 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే రైలును రూపొందించింది.

Also Read : కోహ్లీ బాటలోనే రోహిత్.. లండన్ పయనం అవుతున్నాడా..?

తమ దేశంలో కీలక నగరాల మధ్య రవాణా దూరాన్ని తగ్గించడంలో ఈ అడుగులు వేసింది. బీజింగ్, షాంఘై మధ్య ఉన్న 1,200 కిలోమీటర్ల ప్రయాణం ప్రస్తుతం హై-స్పీడ్ రైలులో దాదాపు 5.5 గంటలు పడుతుంది. కానీ కొత్త మాగ్లెవ్ రైలుతో, దీనికి 2.5 గంటలు లేదా 150 నిమిషాలు మాత్రమే పట్టవచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఈ వారం 17వ మోడరన్ రైల్వేస్ ఎగ్జిబిషన్‌లో ఈ రైలును ఆవిష్కరించారు. ఏడు సెకన్లలోనే అత్యధిక వేగాన్ని అందుకుంది ఈ రైలు.

Also Read : ఆ 5 తప్పులే భారత్ ను ఓడించాయా..?

హుబే ప్రావిన్స్‌లోని డోంఘు లాబొరేటరీలో నిర్వహించిన పరీక్షలలో, మాగ్లెవ్ రైలు ఒక చిన్న టెస్ట్ ట్రాక్‌పై 7 సెకన్లలోపు 404 mph (సుమారు 650 కి.మీ/గం) వేగాన్ని అందుకుంది. సాధారణంగా విమానాలు గంటకు 880 నుండి 925 కి.మీ మధ్య వేగంతో ఎగురుతాయి. ఈ రైలు కూడా అదే వేగంతో ప్రయాణించే విధంగా తయారు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న సాంకేతికత అయస్కాంత లెవిటేషన్‌పై ఆధారపడి ఉంటుంది. రైల్వే ట్రాక్ పై ఎక్కువగా ఆధారపడకుండా ఈ రైలు ప్రయాణం చేస్తుంది. ఈ రైలు గంటకు 620 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుందని ఇంజనీర్లు చెప్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్