తెలంగాణాలో గత ప్రభుత్వంలో జరిగిన పలు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల విషయంలో ప్రస్తుతం విచారణ వేగవంతం అయింది. కీలకమైన ఇరిగేషన్ శాఖ అక్రమాల పై ఏసీబీ ఫోకస్ చేసి కీలక వ్యక్తులను విచారిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిని బయటకు లాగేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సి హరీ రామ్.. ఈ ఈ నూనె శ్రీధర్ లను ఏసీబీ అరెస్ట్ చేసింది.
Also Read : మళ్ళీ ఢిల్లీకి బాబు.. ఏపీకి మోడీ
తాజాగా మాజీ ఈఎన్సి మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహారించిన మురళీధర్.. అప్పట్లో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కీలక సంతకాలు చేసారు. బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో ఉదయం 6 గంటల నుండి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. కుటుంబసభ్యుల, బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా అక్రమస్తులు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం.
Also Read : టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలుంటాయా..?
కాళేశ్వరం ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్ ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే హరీ రామ్.. నూనె శ్రీధర్ల సోదాల్లో వందల కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. మాజీ ఈఎన్సి మురళీధర్ రావును కాళేశ్వరం కమిషన్ విచారిస్తోంది. కమిషన్ విచారణ లో తనకు.. తెలియదు.. మర్చిపోయానని సమాధానాలు ఇచ్చారు మురళీ ధర్. విజిలెన్స్ నివేదికలో వీరితోపాటు మాజీ ఈఎన్సి మురళీధర్ రావు పేరు కూడా ఉంది. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం మురళీధర్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.