Friday, September 12, 2025 09:02 PM
Friday, September 12, 2025 09:02 PM
roots

సింహపురిలో.. వరాల రొట్టె..!

మతసామర్శానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాదాపు నాలుగు లక్షలకు పైగా జనం నెల్లూరు స్వర్ణాల చెరువులో ఏటా జరిగే ప్రఖ్యాత రొట్టెల పండుగకు హాజరయ్యారు. కోరిన కోర్కెలు నెరవేర్చే బార షాహిద్ దర్గాను మనసారా వేడుకొని స్వర్ణాల చెరువులో రొట్టెలను మార్చుకున్నారు. తమ మనసులో ఉండే రకాల కోరికలను తీర్చేందుకు ఒకరి నుంచి ఒకరు రొట్టెలను ఇచ్చి పుచ్చుకున్నారు. మతాలకు ప్రాధాన్యం లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడకు తరలి రావడం విశేషం. ఎప్పటినుంచో నెరవేరని కోరికలు ఇక్కడికి వస్తే నెరవేరుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.

Also read : ఆధార్ కార్డు.. మీ ప్రూఫ్ కాదు.. ఎన్నికల సంఘం బిగ్ షాక్

ఈ నమ్మకంతోనే రాష్ట్రంతో పాటు తమిళనాడు, బెంగళూరు, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రజలు ఏటా లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. రొట్టెల పండుగకు సంబంధించి జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వర్ణాల చెరువు ప్రాంతంలో ప్రత్యేకంగా టెంట్లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. మరోవైపు రొట్టెల పండుగ వచ్చే వాహనాలు, వసతి సదుపాయాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాహనాలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలను నియంత్రించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు రాకుండా పోలీస్ యంత్రాంగం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తుంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను చేపడుతున్నారు. దర్గా ఆవరణలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజన్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచింది. మరోవైపు వేలాది మంది భక్తులకు ఆహారం, తాగునీరు వంటి సదుపాయాలని కొంతమంది దాతలు ఏర్పాటుచేసి దాతృత్వం చాటుకుంటున్నారు.

Also read : మంత్రులకు కౌంట్ డౌన్ స్టార్ట్.. చంద్రబాబు సంచలన కామెంట్స్

నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు పలు ప్రాంతాల నుంచి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకునేందుకు, నెరవేరిన కోరికలకు సంబంధించి రొట్టెలను స్వర్ణాల చెరువులో వదలడం ఆనవాయితీ. ఇందులో భాగంగా వివాహం, ఉద్యోగం, సంతానం, గృహ నిర్మాణం ఇలా పలు రకాల రొట్టెలను భక్తులు మార్చుకున్నారు. పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడంతో నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్