Monday, October 27, 2025 08:57 PM
Monday, October 27, 2025 08:57 PM
roots

మంత్రులకు కౌంట్ డౌన్ స్టార్ట్.. చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం వాడీ వేడీగా సాగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినేట్.. సమావేశం అనంతరం రాజకీయ అంశాలు, వైసీపీ ప్రచారాలపై కూడా చర్చించింది. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు వైసీపీ నేతలు ఈ-మెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేద్దామని కేబినెట్‍లో చంద్రబాబు ప్రస్తావించారు.

Also Read : మద్యం కోసం వైసీపీ నేతల హడావుడి.. జగన్ టూర్ లో ఇంట్రస్టింగ్ సీన్స్

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తుందని కేబినెట్ భేటీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. పెట్టుబడులు పెట్టొద్దని 200 దేశ, విదేశీ కంపెనీలకు మెయిల్స్ పెట్టారని సీఎం దృష్టికి పయ్యావుల తీసుకొచ్చారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతిపరుడుతో ఈ-మెయిల్స్ పెట్టించిందని అయ్యావుల ఆధారాలు చూపించారు. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టే కుట్రలను వైసీపీ మొదటి నుంచి అమలు చేస్తూనే ఉందని మండిపడ్డారు. ఇలాంటి విషయాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు.

ఈ విషయం సీరియస్‍గా తీసుకోవాలని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. ఇక మంత్రులెవ్వరూ సంతృప్తికరంగా పనిచేయట్లేదని సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటెనే ఎందుకు స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. జరుగుతున్న పరిణామాలపై ప్రతి మంత్రీ అప్రమత్తంగా ఉండాలని.. ఏపీ మంత్రులందరికీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గించామని.. నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు లభ్ధి చేకూర్చడంలో మంత్రివర్గ ఉపసంఘం బాగా కృషి చేసిందన్నారు.

Also Read : ఆధార్ కార్డు.. మీ ప్రూఫ్ కాదు.. ఎన్నికల సంఘం బిగ్ షాక్

చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని.. ఏపీలో ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో కేబినెట్‍లో స్వయంగా చదివి వినిపించారు సిఎం. ఇండోసోల్‍కి భూములు వద్దని రైతులను రెచ్చగొట్టించిందే జగన్.. అదే జగన్ పరిశ్రమలు తరలిపోతున్నాయ్ అంటూ తన మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నాడని మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్