Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

గంటాకు కోపం వచ్చింది.. ఈసారి నేరుగానే..!

ఏపీ రాజకీయాల్లో కొందరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి వారిలో గంటా శ్రీనివాసరావు ఒకరు. 1999లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున అనకాపల్లి ఎంపీగా గెలిచిన గంటా.. నాటి నుంచి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. 2004లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో అనూహ్యంగా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం కావడంతో.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఆ తర్వాత సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సైలెంట్‌గా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు గంటా. మరోసారి తన నియోజకవర్గం మార్చేశారు గంటా. ఈసారి భీమిసి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 37 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Also Read : తిరుమల శ్రీవారి భక్తులకు మరో శుభవార్త..!

2014 చంద్రబాబు మంత్రివర్గంలో గంటాకు చోటు దక్కింది. కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు గంటా. ఆయన రాజకీయ శిష్యుడుగా ముత్తంశెట్టి శ్రీనివాస్‌ కూడా వరుసగా గెలుస్తూనే ఉన్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్.. వైసీపీలో చేరారు. ఆ తర్వాత గంటా కూడా చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అలా జరగలేదు. గంటా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. వైసీపీ ప్రభుత్వంలో అవంతి శ్రీనివాస్‌కు మంత్రి పదవి దక్కింది. టీడీపీ తరఫున గెలిచిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరారు. అదే సమయంలో గంటా కూడా చేరిపోతారని అంతా భావించారు. ఒక దశలో ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి కూడా గంటా వైసీపీలో చేరుతారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే ఆ విషయాన్ని అవంతి తీవ్రంగా తప్పుబట్టారు. గంటా రాకను అడ్డుకుంటామన్నారు కూడా.

Also Read : విశాఖలో మరో భారీ పెట్టుబడి.. నారా లోకేష్ కీలక ఒప్పందం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. ఈ విషయంపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. తన రాజీనామాను ఆమోదించాలని 2022లో మరోసారి స్పీకర్‌కు గంటా లేఖ రాయగా 2024 జనవరి 23న స్పీకర్ ఆమోదించినట్లు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీలోకి పోవడంలో గంటా దిట్ట. తరచు పార్టీలు మారుస్తారనే పేరు ఉంది. కాపులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పోటీ చెయ్యడం జనానికి డబ్బులు పంచడంలో సిద్ధ హస్తుడని పేరు కూడా గంటా శ్రీనివాసరావు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీ మొత్తంలో డబ్బులు, క్రికెట్ కిట్‌లు పంపిణీ చేశారని, దీనిపై 2009లో అనకాపల్లి కోర్టులో కేసు నమోదైంది కూడా. విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు కూడా పంపింది. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా గంటా శ్రీనివాసరావు అరెస్టయ్యారు.

Also Read : ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి కేసు.. ఏం చేసుకుంటావో చేసుకోమన్న ప్రసన్న..!

ప్రస్తుతం భీమిలి నియోజకవర్గం నుంచి 90 వేలు పైగా మెజారిటీతో గెలిచిన గంటా.. మంత్రిపదవిపై గంపెడాశ పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం.. ఈ సారికి నో చెప్పారు. గంటాకు బదులుగా ఆయన రాజకీయ శిష్యురాలు వంగలపూడి అనితను హోమ్ మంత్రిని చేశారు చంద్రబాబు. అయితే మంత్రి పదవి దక్కక పోవడంపై తొలి నుంచి అసహనం వ్యక్తం చేస్తున్న గంటా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖ నుంచి గన్నవరం రావాలంటే హైదరాబాద్ మీదుగా ప్రయాణం చేయాలా అంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఇది అప్పట్లో పెద్ద దుమారం రేపింది కూడా. తాజాగా మరో విషయంపై కూడా గంటా చేసిన వ్యాఖ్యలు కూటమి సర్కార్‌ను ఇరుకున పెడుతున్నాయి.

Also Read : ఇంకెన్ని రోజులు సార్.. ఇలా..?

ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ ప‌రువు తీస్తున్నారు. రెండు రోజుల క్రితం సింహాచలం ఆలయం వద్ద గాలి వానకు షెడ్ కూలిపోయింది. దీనిపై అప్పుడే అధికారులు వివరణ ఇచ్చారు కూడా. కానీ గంటా మాత్రం.. తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. “గోడ కడితే పడిపోద్ది.. షెడ్ వేస్తే కూలిపోద్ది.. ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నారు. సింహాచ‌లం ఆల‌యం ఇంత అస్తవ్యస్తం కావ‌డం ఎప్పుడూ చూడలేదు. ప్రజలకు అసలు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు!?” అంటూ గంటా శ్రీనివాసరావు బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయడం పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఏడాది చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగుు భక్తులు మృతి చెందారు. ఈ దుర్ఘటనను అంతా మర్చిపోయినప్పటికీ.. గంటా మాత్రం ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. షెడ్ కూలిపోయిన వెంటనే.. ఈ తరహాలో అసంతృప్తిని గంటా బయటపెట్టారు. “ఎంతో నమ్మకంతో గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు మనం ఏరకమైన భరోసా ఇస్తున్నాం.” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సింహాచలం దేవస్థానంలో ప్రమాదాలను ప్రస్తావిస్తూ.. తనకు పదవి రాలేదనే అక్కసును గంటా బయటపెడుతున్నారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో.. కాపు సామాజిక వర్గంలో తనకు ప్రాధాన్యత తగ్గిపోతుందనేది గంటా భావన. తన సహచరుల్లో అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, నారాయణ వంటి వారికి పదవులు దక్కాయి. కానీ తనకు క్యాబినెట్‌లో చోటు దక్కకపోవడాన్ని గంటా అవమానంగా భావిస్తున్నట్లున్నారు. అందుకే గత నెలలో లోకేష్ విశాఖ జిల్లా పర్యటనకు కూడా గంటా దూరంగా ఉన్నారు. సీనియ‌ర్ నాయ‌కుడిగా త‌ప్పులు స‌రిచేసే ప్ర‌య‌త్నం చేయాలి త‌ప్ప‌.. ఇలా త‌ప్పులు ఎత్తి చూపే ప‌ద్ధ‌తి స‌రికాద‌ని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్