Tuesday, October 28, 2025 01:59 AM
Tuesday, October 28, 2025 01:59 AM
roots

సుప్రీం చీఫ్ జస్టీస్ సంచలన కామెంట్స్

మన దేశంలో నేరాలు చేసిన ఎందరో ప్రముఖులు.. బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్న సంగతి విదితమే. ఏ కేసులో దొరికినా సరే ముందస్తు లేదా తర్వాత బెయిల్ అనేది సులభంగా లభిస్తోంది. దీనిపై సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. భారత న్యాయవ్యవస్థలో చాలా మంది బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు. ఇటీవలి కాలంలో, ఈ సూత్రాన్ని కొంతవరకు మరచిపోయారన్నారు. అదే సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛ అంశంలో రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read : అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు..? మస్క్ పై ట్రంప్ సీరియస్

కొచ్చిలో జరిగిన 11వ జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ స్మారక కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. విచారణలో ఉన్న ఖైదీలను దీర్ఘకాలికంగా జైలులో ఉంచే సంస్కృతి పెరుగుతుండటం, కోర్టులు బెయిల్ కంటే కస్టోడియల్ రిమాండ్ కు ప్రాధాన్యత ఇచ్చే ధోరణిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రబీర్ పుర్కాయస్థ, మనీష్ సిసోడియా, కవిత కేసులలో, జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్చ అంశాన్ని గురించి స్పష్టంగా చెప్పింది.

Also Read : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 7వ తరగతి బాలిక చిచ్చు

ఈ కేసుల్లో తాను సూత్రానికి లోబడే పని చేసానని ఆయన స్పష్టం చేసారు. అదే సమయంలో చట్టపరమైన రక్షణలను ఖచ్చితంగా పాటించకుండా స్వేచ్ఛను హరించివేయడాన్ని సమర్థించలేమని తీర్పులో వెల్లడించింది. గుడికంటి నరసింహులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1978) కేసులో జస్టిస్ అయ్యర్ ఇచ్చిన తీర్పును గవాయ్ ప్రస్తావించారు. విచారణ లేకుండా ఖైదీలను ఎక్కువ కాలం జైలులో ఉంచకూడదని జస్టిస్ కృష్ణ అయ్యర్ కూడా గట్టిగా విశ్వసించారని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్