Friday, September 12, 2025 05:25 PM
Friday, September 12, 2025 05:25 PM
roots

ఆ ఇద్దరి మధ్య ఎందుకింత తేడా..?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఏపీలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ ఇద్దరు కలిసినా సరే.. రెండు పార్టీల అధినేతల గురించే చర్చ. అటు సోషల్ మీడియాలో అయినా సరే.. బహిరంగ సమావేశాల్లో అయినా సరే.. ఇదే అంశం చర్చించుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం పైన, వయస్సుపైన కూడా విమర్శలు చేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిచే వరకు కూడా ఆగేది లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. రిజల్ట్ ట్యాలీలో మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే.. టీడీపీ నేతలంతా ఊర్లు ఖాళీ చేసి వెళ్లాల్సిందే అని ఇప్పటి నుంచే బెదిరిస్తున్నారు.

Also Read : శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్..!

వైసీపీ నేతల బెదిరింపు వెనుక ప్రధాన కారణం జగన్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు. వినుకొండ, తెనాలి, పొదిలి, సత్తెనపల్లి పర్యటనల్లో జగన్ వెంట పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా జనం వస్తున్నారు. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత రప్పా రప్పా అంటూ పోస్టర్లు కూడా వేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఓ వైపు ప్రజల్లో ఆదరణ వస్తోందని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కూటమి సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. వాటి గురించి ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారంటున్నారు. అందుకే చంద్రబాబు హామీల గురించి ప్రజలే నేరుగా ప్రశ్నించాలంటూ జగన్ పిలుపునిచ్చారు.

Also Read : డబ్బు కోసం లైంగిక వీడియోల అమ్మకం.. హైదరాబాద్ జంట అరెస్ట్

2024 ఎన్నికల సమయంలో టీడీపీ నేతలంతా ఒకటే మాటతో ఓట్ల అడిగారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. సూపర్ సిక్స్ పథకాల గురించే ప్రజలకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తానని చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టారు. పెన్షన్ పెంచారు. మెగా డీఎస్సీ నిర్వహించారు. దీపం 2 కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలెండర్లు ఇస్తున్నారు. తల్లికి వందనం కూడా జమ చేసింది కూటమి సర్కార్. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అమలు చేస్తామన్నారు కూడా. అయినా సరే.. జగన్ మాత్రం హామీలు అమలు కావడం లేదని ఆరోపిస్తున్నారు. అందుకే బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిపై పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు జగన్.

Also Read : మరో ఇద్దరు హీరోయిన్ల ఫోన్ ట్యాప్..?

వైసీపీ ముఖ్య నేతలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరు జనం దగ్గరికి వెళ్లాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి సర్కార్ ఫెయిల్ అయ్యిందని వివరించాలని సూచించారు. ఇదే విషయంపై వైసీపీ నేతల్లోనే కలవరం మొదలైంది. వాస్తవానికి పథకాల అమలు చాలా బాగుందని ఇప్పటికే లబ్దిదారులు చెబుతున్నారు. ఇక తల్లికి వందనం గురించి అయితే కూటమి సర్కార్‌కు మంచి మార్కులే వచ్చాయి. గతంలో వైసీపీ సర్కార్ అమలు చేసిన అమ్మ ఒడి కేవలం తల్లికి మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి విద్యార్థికి వచ్చిందని సంతోషంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జనంలోకి వెళితే.. పాత విషయాలు వారు ప్రస్తావిస్తే.. మన పరిస్థితి ఏమిటనేది వైసీపీ నేతల మాట. రహదారుల గురించి, మౌలిక సదుపాయాల గురించి, అన్న క్యాంటిన్ గురించి చాలా మంది రెస్పాన్స వస్తుంది. వీటిపై ప్రజలు నిలదీస్తే.. జవాబు ఏం చెప్పాలనేది వైసీపీ నేతల మాట.

Also Read : పర్యాటక రంగానికి కూటమి మెరుగులు..!

అదే సమయంలో జగన్, చంద్రబాబు మధ్య తేడా గురించి కూడా వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఓ వైపు ప్రతి నెల పెన్షన్ పంపిణీ సందర్భంగా చంద్రబాబు ఒక ఊరికి వెళ్లి.. లబ్దిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. వాళ్ల స్థితిగతులు తెలుసుకుంటున్నారు. వారికి ఆర్థిక భరోసా కల్పించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుపై నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే అదే గ్రామంలో కాసేపు నడుస్తున్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సాయం అందించాలని సూచిస్తున్నారు. ఇది ప్రభుత్వంతో పాటు, పార్టీపై కూడా ప్రజల్లో సదభిప్రాయం తీసుకువస్తుంది. ఇదే సమయంలో జగన్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు గురించి సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లోని క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కుడు.. ఇక నియోజకవర్గాల పర్యటన అంటే పరదాలు.. ఓడిన తర్వాత కూడా జగన్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. చివరికి పార్టీ సూచించిన కార్యక్రమాల్లో కూడా జగన్ పాల్గొనటం లేదు. పరామర్శలకు తప్ప.. జనం దగ్గరికి వెళ్లటం లేదు. అది చేయండి.. ఇది చేయండి అని ప్యాలెస్ నుంచి ఆదేశిస్తున్నారు తప్ప.. ఆయన మాత్రం బయటకు రావడం లేదంటున్నారు.

Also Read : తొలి ఎలక్ట్రిక్ విమానం.. టికెట్ రేట్ తెలిస్తే షాక్ అవ్వడమే..!

ఓ వైపు 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారని.. సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రతి విషయంలో కూడా నేరుగా ప్రజలతో మమేకం అవుతున్నారనేది విమర్శకుల మాట. కానీ జగన్ మాత్రం.. కనీసం ప్యాలెస్ దాటి బయటకు ఎందుకు రావడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ముందుండి నడిపించే వాడే నాయకుడు అవుతాడు తప్ప.. మీరు వెళ్లండి.. నేను వస్తా అనే వాడు నాయకుడు ఎలా అవుతాడని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా తల్లికి వందనం పథకం సూపర్ అని మహిళలు చెబుతున్నారని టీడీపీ నేతలు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం.. మీరు ప్రజల్లోకి వెళ్లండి.. పథకాలు రావడం లేదని నిలదీయండి.. అని చెప్తున్నారు తప్ప.. ఇప్పటికీ కోటరీ దాటి ఎందుకు బయటకు రావడం లేదో జవాబు చెప్పాలని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్