మేము చేస్తే నీతి.. మీరు చేస్తే అవినీతి.. మేము చేస్తే సంసారం.. అదే మీరు చేస్తే.. ఇదే మాట అంటున్నారు వైసీపీ నేతలు. సాధారణంగా రాజకీయాల్లో అందరికీ ఒకే రకమైన రూల్స్ ఉంటాయి. టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ అయినా సరే.. రాజ్యాంగం అందరికీ సమానమే. మరి అలాంటప్పుడు మాకో నీతి.. మీకో నీతి అనే మాటకు ఎలాంటి ఆస్కారం లేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇదే మాట పదే పదే అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదం మొత్తం జగన్ వరుస పర్యటనల కారణంగానే వచ్చింది. ప్రభుత్వం, పోలీసులు వద్దని వారించినా సరే.. పర్యటనలు చేసిన జగన్.. ఎన్నో వివాదాలకు కారణమయ్యారు. పోలీసులు ఆంక్షలు విధించినా సరే.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా పర్యటనకు వెళ్లి.. ఇద్దరి మృతికి కారణమయ్యారు అనేది ప్రధాన ఆరోపణ.
ALSO Read : వివేకా కేసులో మరో నిందితుడ్ని లేపెయడానికి ప్లాన్..?
జగన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బెట్టింగ్ కారణంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని ఏడాది క్రితం పరామర్శించారు. ఇందుకోసం పల్నాడు జిల్లా రెంటపాళ్లకు వెళ్లారు. ఈ పర్యటనపై తొలి నుంచి తప్పుడు ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ నేతలు ఆరోపించారు. కానీ అతను ఆత్మహత్య చేసుకున్న సమయానికి కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఇక పల్నాడు పర్యటన సమయంలో వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. ప్ల కార్డులతో విపక్షాలను బెదిరించారు. అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ పర్యటనలో జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం మరో వివాదానికి కారణమైంది. సింగయ్య మృతితో పోలీసులు జగన్‌పైన కూడా కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై పెద్ద దుమారం రేగడంతో.. దాదాపు 5 రోజుల తర్వాత జగన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారు అంటూ వ్యాఖ్యానించారు. అసలు తన పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టారో చెప్పాలన్నారు. మీరు కానీ, పవన్ కల్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా.. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా.. అని ప్రశ్నించిన జగన్.. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం.. లేదంటే తొలిగిస్తామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా.. అని ప్రశ్నించారు జగన్.
ALSO Read : సింగయ్య మృతి ప్రభుత్వ వైఫల్యమా లేక వైసీపీ నిర్లక్ష్యమా?
జగన్ ప్రశ్నలకు కూటమి నేతలు ధీటుగానే జవాబిస్తున్నారు. చంద్రబాబు పర్యటనలు అడ్డుకున్న సందర్భాలు గుర్తు లేవా అని నిలదీస్తున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబును ఎందుకు ఆపారో గుర్తు లేదా అంటున్నారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో 7 గంటల పాటు చంద్రబాబు నేలపై ఎందుకు కూర్చున్నారో జగన్ మర్చిపోయాడేమో అని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గానికి, సొంత ఊరికి కూడా వెళ్లకుండా చంద్రబాబును తిరుపతి ఎయిర్ పోర్టులో పోలీసులు ఎందుకు ఆపారో చెప్పాలంటున్నారు. ఇక లోకేష్ పాదయాత్ర సమయంలో ఆంక్షలు పెట్టిన విషయం జగన్ మర్చిపోయాడేమో అని ఎద్దేవా చేస్తున్నారు. చివరికి స్టూల్ కూడా లాక్కున్నారని.. మాట్లాడినందుకే లోకేష్‌పైన కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న పవన్‌ను ఎందుకు రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకున్నారో జగన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు రూల్స్ గుర్తుకు రాలేదా జగన్.. అని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. చంద్రబాబు, లోకేష్‌తో పాటు కుటుంబ సభ్యులకు కూడా భద్రతను తగ్గించిన విషయం జగన్ మర్చిపోతే ఎలా నిలదీస్తున్నారు. ఎక్కడో లండన్‌లో ఉన్న జగన్ కుమార్తెలకు కూడా భద్రత కోసం కోట్లు ఖర్చు పెట్టిన నాటి ప్రభుత్వం.. మరి ఏపీలోనే ఉన్న లోకేష్, కుటుంబ సభ్యులకు ఎందుకు భద్రతను తగ్గించిందో జవాబు చెప్పాలంటున్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎన్నోసార్లు మార్గమధ్యలోనే ఆగిపోయిందని.. ఆ విషయం నాటి ముఖ్యమంత్రికి తెలియదా అని గుర్తు చేస్తున్నారు. అయినా జగన్‌ను ప్రతిపక్ష నేతగా ప్రజలు కూడా గుర్తించలేదని.. ఎద్దేవా చేస్తున్నారు. కూటమి నేతల ప్రశ్నలకు వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య సెక్యూరిటీ వార్ తారాస్థాయికి చేరుకుంది.