Friday, September 12, 2025 10:39 PM
Friday, September 12, 2025 10:39 PM
roots

కుక్క గీరినా ర్యాబీస్ వస్తుందా..? యూకేలో ఊహించని ఘటన

కుక్కలను చేసే పనులు చూడటానికి ముద్దుగానే ఉంటాయి. కానీ వాటి ద్వారా వచ్చే నష్టాలు మాత్రం ఊహించడం కష్టమే. ఎప్పుడు ఏ రూపంలో అవి ఆపద తీసుకోస్తాయో చెప్పలేని పరిస్థితి. ఇలాగే మొరాకోలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఓ వీధి కుక్క పిల్ల చేసిన పని ఓ బ్రిటీష్ మహిళ ప్రాణాలు తీసింది. మొరాకోలో వీధి కుక్కపిల్ల గీరడంతో ర్యాబీస్ తో వ్యాధితో.. 59 ఏళ్ల బ్రిటిష్ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సౌత్ యార్క్‌ షైర్‌కు చెందిన వైవోన్ ఫోర్డ్ అనే మహిళ జూన్ 11న ప్రాణాలు కోల్పోయింది.

Also Read : సాక్షిగా బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ లో బిజెపి ఎంటర్ అయినట్టే..?

ఆమె కుమార్తె రాబిన్ థామ్సన్ ఫేస్‌ బుక్ పోస్ట్‌ లో ఈ విషయం వెల్లడించింది. రెండు వారాల క్రితం ఆమె అనారోగ్యానికి గురైందని.. తలనొప్పితో మొదలై నడవడం, మాట్లాడటం, నిద్రపోవడం, తినే సామర్థ్యాలను కోల్పోయిందని ఫలితంగా ఆమె చనిపోయింది ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఊహించలేని నష్టాన్ని తమ కుటుంబం ఇంకా అనుభవిస్తోందని తమ బాధను వెల్లడించింది. దయచేసి జంతువుల కాటును తీవ్రంగా పరిగణించండని తన పోస్ట్ లో విజ్ఞప్తి చేసింది. మీ పెంపుడు జంతువులకు టీకాలు వేయండి.. మీ చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పించండని కోరింది.

Also Read :జగన్ పై క్యాడర్ లో పెరుగుతోన్న కోపం.. కారణం ఇదే

అక్కడి స్థానిక మీడియా ప్రకారం.. యుకెకు తిరిగి వచ్చిన తర్వాత స్థానిక ఆసుపత్రిలో వైవోన్ ఫోర్డ్‌ కు వ్యాధి నిర్ధారణ అయింది. తరువాత షెఫీల్డ్‌లోని రాయల్ హల్లమ్‌షైర్ ఆసుపత్రికి తరలించినా.. ఉపయోగం లేకుండా పోయింది. బాధిత మహిళకు లక్షణాలు కనపడటానికి నెలకు పైగా సమయం పట్టిందని ఆమె కుమార్తె తెలిపింది. గీరినప్పుడు తన తల్లి తేలికగా తీసుకుందని.. ఆ సమయంలో, దాని వల్ల ఎటువంటి హాని జరుగుతుందని ఆమె అనుకోలేదు అని గుర్తు చేసుకుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్