ఇంగ్లాండ్ పర్యటనను భారత్ ఘనంగా ప్రారంభించింది. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత ఆటగాళ్లు బ్యాటింగ్ లో సత్తా చాటారు. తొలి సెషన్ నుంచి భారత్ పట్టుదలగా కనబడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ నిర్ణయం సరైనది కాదని చెప్పడానికి భారత్ కు ఎంతో సమయం పట్టలేదు. బౌలింగ్ కు అనుకూలిస్తుంది అనుకున్న పిచ్ పై కేఎల్ రాహుల్, జైస్వాల్ జోడీ నిలకడగా పరుగులు చేసింది. రాహుల్ ముందు నిదానంగా ఆడిన ఆ తర్వాత దూకుడు పెంచాడు.
Also Read : యోగాంధ్ర.. ఏపీ బ్రాండ్.. రికార్డుల మోత..!
ఇక జైస్వాల్… ఆది నుంచి దూకుడుగానే ఆడాడు. అయితే 91 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సాయి సుదర్శన్ డక్ ఔట్ కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ గిల్.. దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఇదే క్రమంలో జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే జైస్వాల్ అవుట్ కాగా.. పంత్ తో కలిసి ఇన్నింగ్స్ ను మళ్ళీ నిర్మించాడు గిల్. తొలి రోజులో తొలి సెషన్ చివర్లో మాత్రమే ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శించింది.
Also Read : ఛాన్స్ కొట్టేసిన తమిళ కుర్రోడు.. తెలుగోడికి దక్కని ఛాన్స్
లంచ్ తర్వాత కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది భారత్. ప్రస్తుతం గిల్ డబల్ సెంచరీ వైపుగా వెళుతుండగా రిషబ్ పంత్ సెంచరీ దిశగా దూసుకు వెళ్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లను కోల్పోయి 359 పరుగులు చేసింది. రెండో రోజు వీలైనంత ఎక్కువ పరుగులు చేసి ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ ఇస్తే ఫలితం బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మొదటి రోజు మైదానానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు రావడం భారత ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహం నింపింది.