Friday, September 12, 2025 11:18 PM
Friday, September 12, 2025 11:18 PM
roots

అణు యుద్దమేనా..? వెనక్కు తగ్గని ఇరాన్

ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఇజ్రాయిల్ ను అడ్డం పెట్టుకుని అమెరికా చేస్తున్న పరోక్ష యుద్ధం.. రాబోయే వారం, పది రోజుల్లో తీవ్ర రూపం దాల్చే సంకేతాలు కనపడుతున్నాయి. తమతో సన్నిహితంగా ఉండే.. ముస్లిం దేశాల మద్దతు కోరుతోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ తో పాటుగా పలు ముస్లిం దేశాలు అమెరికా మద్దతుతో ఇరాన్ కు దెబ్బకొట్టే సంకేతాలు కూడా కనపడుతున్నాయి. ముందు పరోక్షంగా ఇరాన్ కు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ కు అమెరికా ఎంటర్ కావడంతో సైలెంట్ అయింది.

Also Read : పాకిస్థాన్ కు ఇజ్రాయిల్ ఊహించని షాక్

ఇజ్రాయిల్ దాడులను ఇరాన్ ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేస్తోంది ఇరాన్. ఈ టైం లో.. అమెరికా సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇరాన్ పై తమ సైన్యంతో దాడులు చెయ్యాలని అడుగులు వేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, రాబోయే రోజుల్లో ఇరాన్‌పై సైనిక దాడికి అమెరికా సిద్ధమవుతోంది. సీనియర్ అధికారులను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ఓ కథనం రాసింది. ఇరాన్ పై దాడికి అమెరికా ఉన్న అన్ని అవకాశాలను వాడుకునేందుకు సిద్దమవుతోందని తెలిపింది.

Also Read : లోకేష్ భయంతోనే వైసీపీ నేతలు పారిపోతున్నారా..?

ఇక అణు యుద్ధం జరిగే సంకేతాలు సైతం కనపడుతున్నాయి. ఇజ్రాయిల్ విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గకపోవడంతో పరిస్థితి దిగజారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరానియన్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని నగరాలను స్థానికులు ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ ఆర్మీ హెచ్చరించింది. అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయిల్ హతమార్చిన సంగతి తెలిసిందే. అటు ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలకు సైతం అంతరాయం ఏర్పడుతోంది. దాదాపు 12 గంటల పాటు ఇంటర్నెట్ నిలిచిపోయింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్