Friday, September 12, 2025 11:24 PM
Friday, September 12, 2025 11:24 PM
roots

తల్లికి వందనంపై గుడ్ న్యూస్.. పక్కా ప్లాన్ తో దిగుతున్న సర్కార్

2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ హామీలు అత్యంత కీలకంగా ప్రభావం చూపించాయి. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి నవరత్నాలు ఏ విధంగా సహకరించాయో సూపర్ సిక్స్ హామీలు కూటమి పార్టీలకు అంతకుమించి ఉపయోగపడ్డాయని చెప్పాలి. ఇందులో ప్రధానంగా తల్లికి వందనం కార్యక్రమం ఓ సంచలనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తామని అప్పట్లో కూటమి అభ్యర్థులు ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లారు.

Also Read : కుల సర్పం.. బుసలు కొడుతుందా..?

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. దీనిపై వైసీపీ కీలక నేతలు పదేపదే మీడియా సమావేశాల్లో ఆరోపణలు చేయడం చూసాం. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాబోయే విద్యా సంవత్సరానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి నిధులు కేటాయించారు. ఇచ్చిన హామీ ప్రకారం.. రేపటి నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

Also Read : అప్పుడు ప్రజాస్వామ్యం లేదా సాక్షి..?

కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి సంవత్సరం కావస్తున్నా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ 15 వేల రూపాయలు జమ చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాజకీయ విమర్శకులకు అవకాశం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. గతంలో అమ్మఒడి కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. ఆ మాదిరిగా విమర్శలకు అవకాశం ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో పథకం పెద్ద ఎత్తున అమలు జరిగే విధంగా కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Also Read : కూటమి.. పొత్తు ధర్మం పాటిస్తారా లేదా..?

ఈ పధకంలో బాగంగా 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు జరుగుతుంది. గతంతో పోలిస్తే అర్హుల సంఖ్య భారీగా పెరిగింది. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తున్నారు. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీ.వో విడుదల చేసింది ఏపి ప్రభుత్వం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్