ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ది ఆశ్చర్యకర శైలి. వాళ్లు ఏం చేసినా కరెక్ట్ అనే భావనలో ఉండే ఆ పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటలు కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సాక్షి కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా తెలుగుదేశం పార్టీని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి వైసీపీ నేతలు పెద్దపెద్ద ప్రసంగాలు కూడా ఇవ్వటం గమనార్హం.
Also Read : బ్రేకింగ్: వేశ్య కామెంట్స్ పై జాతీయ మహిళా కమీషన్ సీరియస్.. డీజీపీకి లేఖ
ఇక సాక్షి మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున హంగామా నడుస్తోంది. అయితే 2019లో ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అరెస్టు వరకు ఎన్నో ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు వైసిపి ప్రభుత్వం చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులతో పాటుగా హత్య రాజకీయాలను కూడా పెద్ద ఎత్తున వైసిపి నాయకులు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్ మాట్లాడిన మాటలు కూడా ఎన్నో సందర్భాల్లో వివాదాస్పదమయ్యాయి. పవన్ కళ్యాణ్ మాజీ భార్యలను అలాగే ప్రస్తుత భార్యను అవమానిస్తూ ఆయన వ్యక్తిగత జీవితంపై వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ గుర్తుండే ఉంటాయి.
Also Read : కూటమి.. పొత్తు ధర్మం పాటిస్తారా లేదా..?
వీటిని మర్చిపోయిన వైసీపీ నేతలు లేదంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళు.. నీతి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి గురించి జగన్ ఎంతో వెటకారంగా మాట్లాడిన సందర్భం ఉంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇలా కొంతమంది వైసీపీ నాయకులు పదేపదే చంద్రబాబునాయుడు వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాల్లో.. వైసిపి కి మద్దతు ఇచ్చే వ్యక్తులు ఆ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు సాక్షి కార్యాలయాల వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమాల గురించి హడావుడి చేయటం.. ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.