ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్తూ వస్తున్నారు. రాజకీయంగా వైసిపి బలహీనంగా ఉండటం దానికి తోడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలు ఇబ్బందికరంగా మారడంతో భవిష్యత్తును వేరే పార్టీలో చూసుకుంటున్నారు కొంతమంది నేతలు. పలువురు రాజ్యసభ ఎంపీ లతో పాటుగా ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరి కొంతమంది మాజీ ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read : టీడీపీలోకి ఆ ఇద్దరు మాజీలు..!
ఇటీవల ఒకరిద్దరూ మాజీ ఎమ్మెల్యేలు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. త్వరలోనే ఓ రాజ్యసభ ఎంపీ కూడా షాక్ ఇచ్చే అవకాశం కనపడుతోంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు ఆసక్తిగా ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన ఒక కేంద్రమంత్రి తో సంప్రదింపులు జరిపినట్లుగా టిడిపి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. సదరు కేంద్రమంత్రి తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో బిజెపిలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని.. వ్యక్తిగత కేసుల నేపథ్యంలో వైసీపీలో ఉంటే తనకు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని ఆయన ముందు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
Also Read : వాడింది నెయ్యే కాదు.. సీబీఐ సంచలనం
వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలోనే ఆయన పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను అయోధ్య రామిరెడ్డి ఖండించారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన వైసిపి నేతలకు దూరంగా ఉంటున్నారు. సొంత జిల్లా నేతలతో కూడా పెద్దగా అయినా టచ్ లో లేరనే వార్తలు వినపడుతున్నాయి. అయితే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సహకారంతో ఆయన పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇటు టిడిపి నేతలతో కూడా ఆయన టచ్ లోకి వచ్చినట్టు ప్రచారం మొదలైంది. మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.