Friday, September 12, 2025 09:04 PM
Friday, September 12, 2025 09:04 PM
roots

ఆ తేదీ కోసమే కూటమి నేతల ఎదురుచూపులు..!

కూటమి నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఏడాది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి ప్రభుత్వం ఏర్పాటు వరకు 8 రోజుల పాటు తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. జూన్ 4వ తేదీన వచ్చిన ఫలితాల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 164 స్థానాలు వచ్చాయి. అప్పటి వరకు 30 ఏళ్ల పాటు తానే సీఎం అని.. వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీ పరువు పోయినట్లుంది.

Also Read : టీడీపీలోకి ఆ ఇద్దరు మాజీలు..!

కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు ఐదేళ్ల పాటు విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టంపైన కూడా దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం పింఛన్ పెంపుతో పాటు మెగా డీఎస్సీ కూడా ప్రకటించారు. ముందుగా చెప్పినట్లే… బకాయిలతో కలిపి జూలై ఒకటినే పింఛన్ అందించారు. అలాగే దీపం – 2 పథకం కింద అర్హులైన వారికి ఏడాదికి 3 గ్యాస్ సిలండర్లు ఉచితంగా అందిస్తున్నారు. అయితే దీనిపై విపక్షాలు వ్యాఖ్యలు చేయడంతో.. ఇకపై ఒకేసారి మూడు గ్యాస్ సిలండర్ల డబ్బులు కూడా అకౌంట్‌లో వేస్తామని కూడా ప్రకటించారు.

Also Read : ఫామ్ లోకి వచ్చిన జోగి, అంబటి

ఇక సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను కూడా అమలు చేయనున్నారు. ఈ నెల 12వ తేదీనే ప్రతి పిల్లవాడి తల్లి అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. అలాగే ఖరీఫ్ ప్రారంభానికి 3 రోజులు ముందుగానే రైతులకు డబ్బులు ఇస్తామని ప్రకటించారు. ఇక మరో కీలకమైన హామీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో సూపర్ సిక్స్ హామీలను కూటమి సర్కార్ అమలు చేసినట్లైంది. ఇదే ఇప్పుడు కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలను కాలర్ ఎగురవేసుకునేలా చేస్తున్నాయి.

Also Read : రంగంలోకి షర్మిల.. వారే టార్గెట్..!

ఇక ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12వ తేదీకి సరిగ్గా ఏడాది. కూటమి పాలన రెండో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సంబరాలు అంబరాన్ని అంటేలా కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా వేడుకలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఊరువాడా ఒక్కటయ్యేలా సంబరాలు జరపాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. రెండు రోజుల క్రితం వెన్నుపోటు దినం అంటూ వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సమయంలో అంబటి వంటి నేతలు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. దీనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా లభించింది. ఇక వైసీపీ నేతలు కొన్ని చోట్ల భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకున్నారు కూడా.

Also Read : జగన్ చేష్టలతో షాక్ లో వైసీపీ

దీంతో దీనికి ధీటుగా జవాబు చెప్పాలంటే.. జూన్ 12వ తేదీన ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని ఘనంగా నిర్వహించాలనేది కూటమి నేతల ప్లాన్. జూన్ 12న కీలకమైన పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ వేడుకను అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించాలని ఆయా జిల్లాల అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం ఏర్పాడిన తొలి ఏడాదిలోనే ఏకంగా 9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. వీటి ద్వారా 9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించిన కూటమి ప్రభుత్వం… తమ ఏడాది పాలనను కూడా చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని భావించడంలో తప్పు లేదు కదా. అందుకే జూన్ 12న ఏపీలో మామూలుగా ఉండదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్