Friday, September 12, 2025 05:14 PM
Friday, September 12, 2025 05:14 PM
roots

సురేష్ బాబు సంచలన నిర్ణయం.. త్వరలో చంద్రబాబు వద్దకు

సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుంచి సిద్ధంగానే ఉంది. 2019లో జగన్ వచ్చిన తర్వాత కాస్త పరిస్థితులు మారిన 2024 లో మాత్రం చంద్రబాబు నాయుడు సర్కార్ సినిమా పరిశ్రమ రాష్ట్రానికి రావాలని కోరుతూనే వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి కావడంతో ఆయనను చూసి సినిమా పరిశ్రమ రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం ఉందని అందరు భావించారు. ప్రభుత్వం ఏర్పడే ఏడాది కావస్తున్నా సరే ఇప్పటివరకు సినిమా పరిశ్రమ వాళ్ళ అవసరాలకు ఏమైనా రాష్ట్ర అభివృద్ధి మీద మాత్రం దృష్టి సారించలేదు.

Also Read : రంగంలోకి షర్మిల.. వారే టార్గెట్..!

రాష్ట్రంలో సినిమా టికెట్ల పెంపు కోసం మాత్రమే సినిమా ప్రముఖులు ప్రభుత్వ పెద్దలను కలుస్తూ వస్తున్నారు. ఈ టైంలో సినిమా పరిశ్రమ విషయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. దీనితో రాష్ట్రంపై దృష్టి పెట్టాలని సినిమా వాళ్లు కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామానాయుడు స్టూడియో నిర్మాణం ఆంధ్రప్రదేశ్ లో చేపట్టాలని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఒకరిద్దరు నిర్మాతలు రాష్ట్రంలో స్టూడియోలో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది.

Also Read : ట్రంప్ సంచలనం.. 12 దేశాలపై నిషేధం

అమరావతిలో స్టూడియో నిర్మాణానికి ఆయన ప్రభుత్వ వద్ద భూమి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. లేదంటే కంచికచర్ల సమీపంలో స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని సురేష్ బాబు భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ హైవే కి దగ్గరగా ఉండటమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరగా పూర్తయితే గన్నవరం విమానాశ్రయానికి కూడా దగ్గరగానే ఉంటుంది. దీనితో కంచికచర్ల సమీపంలో స్టూడియో నిర్మించాలని సురేష్ బాబు ఇప్పటికే ఓ డి పీ ఆర్ కూడా రెడీ చేసి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తన ఆలోచనను వివరించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్