Friday, September 12, 2025 07:19 PM
Friday, September 12, 2025 07:19 PM
roots

ఆర్సీబీ సంచలన నిర్ణయం

ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. విజయోత్సవ వేడుకలు జరుపుకోవడానికి బెంగళూరు వెళ్ళగా అక్కడ చోటు చేసుకున్న విషాదం ఇప్పుడు ఆ జుట్టును వెంటాడుతోంది. ఊహించని విధంగా అభిమానులు భారీగా మైదానం వద్దకు రావడంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి.

Also Read : జగనన్న.. ఎక్కడున్నావు.. ఏమయ్యావు..?

దీనిపై కర్ణాటక హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అభిమానులు ఆ స్థాయిలో వస్తారని ఏమాత్రం ఊహించని అక్కడి పోలీసులు పెద్దగా ఏర్పాట్లు చేయలేదని విమర్శలు సైతం వచ్చాయి. అభిమానులు కూడా వెర్రిగా లక్షల్లో తరలిరావడంతో పోలీసులు వెంటనే స్పందించడం కూడా కష్టంగా మారింది. ఇక తాజాగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర హైకోర్టు మైదానం వద్ద అంబులెన్స్ లు ఎందుకు లేవని నిలదీసింది. ఈ ఘటనపై బీసీసీఐ అధికారులు కూడా స్పందించారు. దీనిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా కొన్ని వర్గాల నుంచి వినపడుతున్నాయి.

Also Read : కరోనా.. శాస్త్రవేత్త సంచలన కామెంట్స్

ఇక తాజాగా మరణించిన వారికి ఆర్సిబి ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున కోటి పది లక్షల రూపాయలు విడుదల చేసింది. అలాగే గాయపడిన వారి కోసం ప్రత్యేక ఫండ్ కూడా ఏర్పాటు చేసింది ఆర్ సి బి యాజమాన్యం. ఇక గాయపడిన వారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా అండగా నిలబడ్డాయి. మరణించిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా ఆర్థిక సహాయం కూడా ప్రకటించాయి. ఇక ఆటగాళ్లు కూడా తమ వంతు సహాయం అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆటగాళ్లపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్లు సైతం వినపడుతున్నాయి. పరిస్థితి చేయి దాటినప్పుడు ఆటగాళ్ల నుంచి సహకారం లేదని పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్