Friday, September 12, 2025 11:23 PM
Friday, September 12, 2025 11:23 PM
roots

ఆగ్రో ఉగ్రవాదం.. అమెరికాను షేక్ చేసిన చైనా.. కంగారులో భారత్

కాలం మారుతున్న కొద్దీ సాంకేతిక పరిజ్ఞానం కొత్త రూపు సంతరించుకున్నట్టు.. ఉగ్రవాదం కూడా రోజు రోజుకి తన రూపాన్ని మార్చుకుంటుంది. తుపాకులు, బాంబులు, రాకెట్ లాంచర్ల నుంచి బయో వార్.. ఇప్పుడు ఆగ్రో వార్ దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి చైనా శ్రీకారం చుడుతోంది. తాజాగా అమెరికా విషయంలో చైనా.. ఆగ్రో ఉగ్రవాదానికి శ్రీకారం చుట్టింది. తాజాగా చైనాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

Also Read : తెనాలి పర్యటన వెనుక ఇంత కుట్ర ఉందా..?

అమెరికాలో వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసేందుకు చైనా చేసిన కుట్రగా భావిస్తున్నారు. అక్కడి పంటలలో తల ముడతను కలిగించే వైరస్ ను పంపించేందుకు చైనా కుట్ర చేసినట్టుగా భావిస్తున్నారు. చైనా పౌరుడు జున్యోంగ్ లియు.. అమెరికాలో ఉంటున్న తన ప్రియురాలును కలిసేందుకు గత ఏడాది జులైలో వెళ్ళాడు. ఆ సమయంలో అతని వద్ద కొన్ని అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ఫంగస్‌ ను అక్రమ రవాణా చేసినట్లు ఒప్పుకున్నాడు.

Also Read : మతం కార్డు.. మలేషియాలో పాక్ డ్రామాలు

తన స్నేహితురాలు పనిచేసే మిచిగాన్ విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో దానిపై పరిశోధన చేయడానికి తాను అలా చేశానని అతను చెప్పడం గమనార్హం. దీనిపై అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేసారు. అమెరికాలో ఆహార కొరత సృష్టించేందుకు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ తరహా వైరస్ లను క్రీస్తుపూర్వం 660లో మొదటిసారి ఉపయోగించారని గుర్తించారు. దీనిపై భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ తో చైనాకు ఉన్న స్నేహం నేపధ్యంలో పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి కీలకమైన వ్యవసాయ రాష్ట్రాలు పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఉండటంతో ఈ తరహా దాడులకు దిగే అవకాశం ఉందనే ఆందోళన మొదలైంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్