కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. ఏడుకొండల వాడి దర్శనానికి నిత్యం లక్షల మంది తిరుమల చేరుకుంటారు. తిరుమల పేరు చెప్పగానే.. అందరికీ ముందుగా లడ్డూ ప్రసాదం గుర్తుకు వస్తుంది. ఐదేళ్ల పాటు ఏపీలో విధ్వంసకరమైన పాలన కొనసాగించిన వైసీపీ హయాంలో తిరుమలలో ఎన్నో అక్రమాలు జరిగాయనేది తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణ. టికెట్ల కేటాయింపు మొదలు.. ప్రసాదంలో నాణ్యత అంశంపై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి ప్రసాదం కోసం వినియోగించే నెయ్యిలో భారీ ఎత్తున కల్తీ జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదం పెద్ద దుమారం రేపింది.
Also Read : ద్వారంపూడికి మ్యూజిక్ స్టార్ట్ అయినట్టే..?
నాలుగేళ్ల పాటు టీటీడీపై పెత్తనం చెలాయించిన జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కల్తీ నెయ్యి వినియోగంపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా మరిన్ని విషయాలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో నిలిచిన ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ ముగ్గురు మాజీలపైనే ఫోకస్ పెట్టిన అధికారులు.. వారికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంలో ఈ ముగ్గురి విచారణ అత్యంత కీలకంగా మారనుందనేది అధికారుల మాట. ఈ ముగ్గురు ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Also Read : బాబు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు..!
శ్రీవారి ప్రసాదం తయారీ కోసం వినియోగించే నెయ్యి టెండర్ల నుంచి సరఫరా వరకు మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారులు ఎవరనే విషయంపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ బృందం.. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంపై సునిసితంగా దర్యాప్తు చేస్తోంది. నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లో ఇప్పటికే సోదాలు చేసిన సిట్ బృందం.. నలుగురిని అరెస్టు చేసింది. ఇక టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ అప్పన్నకు నోటీసులు జారీ చేసిన సిట్.. నాలుగు రోజులుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. గతంలో టీటీడీలో పాలనా పరంగా కీలకమైన హోదాలో పని చేసిన ఇద్దరు ప్రముఖులతో పాటు టీటీడీ నిర్ణయాలు అమలులో అధికార యంత్రాంగానికి పెద్దగా వ్యవహరించిన మారో మాజీ అధికారికి కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
గతంలో బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు ప్రముఖుల వ్యాపారా లావాదేవీలపై కూడా ఇప్పటికే దృష్టి పెట్టారు. ఆ ఇద్దరినీ విచారిస్తే.. మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయనేది సిట్ అధికారుల మాట. అలాగే గతంలో తిరుమలలో పెత్తనం చెలాయించిన అధికారి వ్యవహారంపై కూడా సిట్ బృందం విచారణ జరిపించనుంది. ఈ కేసులో ఇప్పటికే ఏఆర్ డెయిరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖరన్, భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్టవి డెయిరీ సీఈవో అపూర్వా చావడాల విచారణ పూర్తి చేశారు.