వైసీపీ నేతల అవినీతి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. కొంతమంది విషయంలో కఠినంగా ముందుకు వెళ్లబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన కొంతమంది నాయకులు ఊచలు లెక్కబెడుతున్న సంగతి క్లారిటీ ఉంది. త్వరలోనే మరికొంతమందిని కూడా జైలుకు పంపించే అవకాశాలు ఉండొచ్చనే సంకేతాలు సైతం వస్తున్నాయి. తాజాగా మరో నాయకుడు పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది.
Also Read : మాజీ క్రికెటర్ కు బీజేపీ గాలం.. ఈసారి వర్కౌట్ అవుతుందా..?
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రేషన్ బియ్యం దందాతో పాటుగా పలు అక్రమాలు చేసి.. ఏది పడితే అది మాట్లాడిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి గురి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ బియ్యం అక్రమాల విషయంలో ఇప్పటికే పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది. విదేశాలకు తరలించిన రేషన్ బియ్యం విషయంలో అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ రేషన్ బియ్యం దందాను అదుపులోకి తీసుకొచ్చింది.
Also Read : కామెడీ స్పీచ్ ఇరగదీసిన జగన్
రేషన్ బియ్యం ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున సంపాదించారు అనేది ప్రధాన ఆరోపణ. దీనిలో ముడుపులు కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అప్పట్లో వెళ్లినట్లు ప్రచారం జరిగింది. విదేశాలకు తరలించిన బియ్యం విషయానికి సంబంధించి.. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని విచారించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. దానితో పాటుగా పలు భూ అక్రమాలకు సంబంధించి కూడా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. జగనన్న కాలనీలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిపై కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.