Sunday, June 21, 2026 06:01 AM
Sunday, June 21, 2026 06:01 AM

మళ్ళీ యాక్టివ్ అవుతున్న సజ్జల.. వైసీపీ సోషల్ మీడియా రియాక్షన్స్ అదుర్స్

2024 లో వైసీపీ అధికారం కోల్పోవడానికి కారణం ఎవరు అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా వినపడే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీలో షాడో సీఎంగా ఆయన అప్పట్లో పెత్తనం చెలాయించాలని అనుకోవడాన్ని ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. పార్టీలో లేదంటే ప్రభుత్వంలో పదవి ఉండాలంటే సజ్జల ఆశీర్వాదం ఉండాలి అనే స్థాయికి తీసుకెళ్లారు రామకృష్ణారెడ్డి. కార్యకర్తలకు కూడా ఈయన విషయంలో ఇప్పటికీ అసంతృప్తి ఉంటుంది. జగన్ ను తప్పుదోవ పట్టించిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారనేది వారి భావన.

Also Read : జగన్ 2.0.. భయపడుతున్న జనం..!

పార్టీతో పాటుగా ప్రభుత్వంలో కూడా ఆయనదే ఆధిపత్యం నడుస్తూ ఉండేది. మంత్రులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించిన ఏకైక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత క్రమంగా ఆయన సైలెంట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ సజ్జల దూకుడుగా ముందుకు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించడంతో పాటుగా అరెస్టయిన వారిని పరామర్శిస్తున్నారు సజ్జల. జిల్లా నాయకులతో పాటుగా నియోజకవర్గ స్థాయి నాయకులతో ఆయన సమావేశాలు నిర్వహించి దిశ నిర్దేశం కూడా చేస్తున్నారు.

Also Read : ఎందుకు ఈ మౌనం.. సాక్షి తప్పుడు ప్రచారంపై సైలెంట్ గా కూటమి

ఈయన కారణంగా పార్టీ అభాసుపాలు అయిందని పార్టీ నాయకులు ఇప్పటికీ అభిప్రాయపడుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తి మళ్ళీ పార్టీలో కీలకంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఆ పార్టీ సోషల్ మీడియా. చాలామంది కార్యకర్తలు బహిరంగంగానే ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అధికారం కోల్పోవడంతో పాటుగా పార్టీని ప్రజలలో చులకన చేయడంలో సజ్జల కీలకపాత్ర పోషించారని.. అలాంటి వ్యక్తి మళ్ళీ పార్టీలో ఏ విధంగా యాక్టివ్ అవుతారంటూ మండిపడుతున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది సజ్జలను కలిసిన తర్వాత బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్