Friday, September 12, 2025 11:08 PM
Friday, September 12, 2025 11:08 PM
roots

భారతీయులకు ట్రంప్ చుక్కలు.. మరిన్ని సంచలనాలు..?

ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అర్ధం కాని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఆ దేశంలో క్రమంగా షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా విదేశాల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పన్నులు, సుంకాలు విధించే విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడి ప్రముఖ కంపెనీలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదంగా మారుతోంది.

Also Read : కోవర్టులు.. వలస పక్షులు.. బీ కేర్ ఫుల్..!

భారత్ తో స్నేహం చేస్తూనే ట్రంప్ డ్రామాలు ఆడటం గమనార్హం. ఈ తరుణంలో ట్రంప్ కు అమెరికా కోర్ట్ షాక్ ఇచ్చింది. ట్రంప్ సర్కార్.. పెద్ద ఎత్తున సుంకాలను విధించడానికి తమ అధికారాలను వినియోగించడాన్ని సమర్దిస్తునే.. కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంచితే ఇప్పుడు భారత్ సహా అనేక దేశాల్లో వీసా ఫీజులను భారీగా పెంచేందుకు ట్రంప్ సర్కార్ సిద్దమవుతున్నట్టు సమాచారం. అదే విధంగా అమెరికాలో విద్యా సంస్థలు కూడా ఫీజులను పెంచాలని, వీసా నిబంధనలకు మరిన్ని షరతులను పెంచాలని ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read : వాడు చేసేది చిచోరా రాజకీయం.. అన్న పై కవిత తిరుగుబాటు

వీసా ఇంటర్వ్యూలకు సిబ్బందిని కూడా పరిమితం చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. తమ దేశంలో ఆస్తులు కొనే విదేశీయులపై ట్రంప్ సర్కార్ నిఘా పెట్టింది. హెచ్ 1 బీ వీసాలతో ఉన్న వారు ఇల్లు కొనే విషయంలో జాగ్రత్త పడక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన వారిపై ట్రంప్ సర్కార్ నిఘా పెడుతోంది. అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అనే షరతులు విధించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. పార్ట్ టైం ఉద్యోగాల విషయంలో కూడా కఠినంగా ఉండాలని భావిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్