ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కంటే ఏపీ లిక్కర్ కుంభకోణం పెద్దదంటూ పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. దీనికి సంబంధించి పలు విషయాలను స్వయంగా ఎంపీ ని అడిగి తెలుసుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక దర్యాప్తు బృందం లిక్కర్ కుంభకోణం పై దూకుడు పెంచింది.
Also Read : ఏకతాటిపైకి పార్టీ.. లోకేష్ కు రూట్ క్లియర్
ఈ కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న మనీ లాండరింగ్ విషయంలో.. ఈడి అధికారులు ఫోకస్ పెట్టారు. అప్పట్లో డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ తీసుకుని మాత్రమే మద్యం విక్రయాలు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 98% డిజిటల్ పేమెంట్ లేకుండానే క్యాష్ తీసుకుని మద్యం విక్రయాలు జరిగాయి. ఇక ఇదిలా ఉంటే నేటి నుంచి ఈడి అధికారులు లిక్కర్ కుంభకోణంపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటివరకు విచారణలో ఏ విధంగా కూడా జోక్యం చేసుకోని ఈడి.. నేరుగా నిందితులను విచారించేందుకు విజయవాడ చేరుకుంది.
Also Read : కడప జిల్లా స్వీప్ చెయ్యాలి.. చంద్రబాబు సంచలన కామెంట్స్
విజయవాడ జిల్లా జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు కోర్టు నుండి అనుమతి కూడా తీసుకుంది ఈడి. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బును ఏ విధంగా మళ్లించారు.. ఎవరెవరి ద్వారా ఎప్పుడెప్పుడు ఈ నగదు చేతులు మారింది అనే అంశాలపై ఈడి అధికారులు ప్రశ్నలు వేయనున్నారు. మంగళవారం సిట్ అధికారులను కలిసి కేసుకు సంబంధించి పూర్వపరాలను అడిగి తెలుసుకున్నారు అధికారులు. ఇకనుంచి కేసులో పరస్పర సహకారం తీసుకునే ముందుకు వెళ్లాలని ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఈడి అధికారులు అంగీకారానికి వచ్చారు.