రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేశారు. గిల్ కెప్టెన్ గా పంత్ వైస్ కెప్టెన్ గా జట్టును ఎంపిక చేసింది సెలెక్షన్ కమిటీ. ఆస్ట్రేలియా పర్యటనలో లోపాలను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేశారు. యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం కల్పించింది సెలక్షన్ కమిటీ. కెప్టెన్ గా గిల్ సమర్ధతపై నమ్మకం ఉంచిన సెలక్షన్ కమిటీ.. ఇంగ్లాండ్ పర్యటనతో అతనికి కెప్టెన్ గా వెల్కమ్ చెప్పింది. ఇక ఈ పర్యటనలో కొత్త ఆటగాళ్లపైనే అందరి దృష్టి.
Also Read : టీమిండియాకు కొత్త సారధి..!
ఐపీఎల్ లో.. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, ఆర్షదీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్ లకు జట్టులో చోటు కల్పించారు. ఈ నలుగురు ఆటగాళ్లపైన జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో పేస్ బౌలింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది సెలెక్షన్ కమిటీ. ఇద్దరు పేస్ ఆల్రౌండర్లను ఎంపిక చేసింది. సీనియర్ ఆల్రౌండర్ ఠాకూర్ కు అవకాశం కల్పిస్తూనే స్పిన్ ఆల్రౌండర్ ల పై కూడా దృష్టి పెట్టింది. ఇంగ్లాండ్ మైదానాల్లో కౌంటి మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న.. అర్షదీప్ సింగుకు తుది జట్టులో చోటు కల్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.
Also Read : గులాబీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు..!
అక్కడి మైదానాల్లో స్వింగ్ కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి అర్షదీప్ సింగ్ బౌలింగ్ గేమ్ చేంజర్ అవుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. ఇక సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఎంతవరకు రాణిస్తారు అనే దానిపై టాప్ ఆర్డర్.. ఆధారపడి ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరికి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఓపెనర్లుగా రాహుల్, జైస్వాల్ ఖరారు కాగా.. మిడిల్ ఆర్డర్ భారాన్ని ఈ ఇద్దరూ మోయనున్నారు. ఇక అభిమన్యు ఈశ్వరన్ కు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో ఎంపికైనా అరంగేట్రం చేయలేకపోయాడు.