విజయవాడలో ఏదో తెలియని అలజడి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆటోమొబైల్ రంగంతో పాటుగా ఎలక్ట్రానిక్ రంగం.. రియల్ ఎస్టేట్.. భవన నిర్మాణాలు.. వైద్యరంగం, విద్య.. ఇలా నిత్యం ఏదో ఒక రద్దీలో కనపడే విజయవాడ.. ఉగ్రవాదుల అలజడితో ఆందోళనగా బతుకుతుంది. ఏమీ లేదని తెలిసినా.. ఏదో ఉందనే భయం వెంటాడుతోంది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత.. విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నారనే ఓ ప్రచారం నగరవాసులను కంగారు పెట్టింది. ఇటువంటి విషయాల్లో విజయవాడ గతంలో ఈ తరహా అనుభవాలు చూడలేదు.
Also Read : బెజవాడలో బంగ్లాదేశ్ అలజడి.. ఎవరు వీరంతా..?
ముఖ్యంగా వన్ టౌన్ ప్రాంతంలో ఉగ్రవాదుల నివాసం ఉంటున్నారు అనే వార్త భయపెట్టింది. ఇక తాజాగా కానూరు సమీపంలో విదేశీయులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా 15 మంది విదేశీయులను గుర్తించారు. మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన వారు విజయవాడలోని సనత్ నగర్ లో నివాసం ఉంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హడావిడిగా బృందాలుగా విడిపోయి పోలీసులు తనిఖీలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమ సొంత దేశాలకు వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
Also Read : హరీష్ రావుకే కవిత మద్దతు..? లేఖ ఉద్దేశం ఇదేనా..?
ఇక తాజాగా నిత్యం రద్దీగా ఉండే బీసెంట్ రోడ్ లో బాంబు ఉందనే ఓ ఫోన్ కాల్.. విజయవాడ వాసులను మరింత కంగారు పెట్టింది. కోట్ల రూపాయల బిజినెస్ జరిగే బీసెంట్ రోడ్ లో బాంబు ఉందనే సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. చివరకు బాంబు ఏమీ లేదని మధ్యాహ్నం నుంచి షాపులు ఓపెన్ చేసుకోవచ్చు అని.. వ్యాపారస్తులకు పోలీసులు సూచించారు. ఈ ఫోన్ కాల్ ఫేక్ అయినా సరే నగరవాసులలో మాత్రం భయం వెంటాడుతూనే ఉంది. గతంలో మావోయిస్టులు విజయవాడ ను అడ్డాగా చేసుకుని.. తమ కార్యకలాపాలు నిర్వహించేవారు. క్రమంగా మావోయిస్టుల ఉనికి విజయవాడలో తగ్గుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయనే ప్రచారం.. పోలీసులను.. నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.