Saturday, September 13, 2025 01:13 AM
Saturday, September 13, 2025 01:13 AM
roots

కోహ్లీ బాటలోనే రోహిత్.. సంతోషంలో ఫాన్స్..!

టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ.. మళ్లీ వైట్ జెర్సీలో కనపడనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ ఇంగ్లాండ్ లో కౌంటి క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని జాతీయ మీడియా కథనాలు రాస్తుంది. జట్టులో జరుగుతున్న మార్పులతో రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడని, విదేశాల్లో అత్యంత ప్రముఖ టోర్నీగా చెప్పుకునే కౌంటి మ్యాచ్లను ఆడటానికి ఒప్పందం చేసుకోబోతున్నాడని జాతీయ మీడియా పేర్కొంది.

Also Read : మొన్న రోహిత్.. నిన్న కోహ్లీ.. నేడు బూమ్రా.. ఫ్యాన్స్ కు షాక్

ఇటీవల విరాట్ కోహ్లీ సైతం కౌంటి క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీని గురించి సోషల్ మీడియాలో కూడా ఆసక్తికర చర్చ జరిగింది. కౌంటీ క్రికెట్లో ఓ ప్రముఖ జట్టు విరాట్ కోహ్లీతో చర్చలు జరిపిందని.. తమ జట్టు కు ఆదరణ కోసం విరాట్ కోహ్లీతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు రోహిత్ శర్మతో కూడా ఓ ప్రముఖ జట్టు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇద్దరితో మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : అతడికి ఛాన్స్ పక్కా.. గంభీర్ డిసైడ్ అయ్యాడా..?

వన్డే మ్యాచ్ లు ఇప్పట్లో లేవు కాబట్టి ఇద్దరూ.. ఇంగ్లాండులో కౌంటి మ్యాచులు ఆడే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. బ్రిటన్ లో కూడా అభిమానులు ఉన్నారు. మన దేశం నుంచి వెళ్లిన వారితో పాటుగా అక్కడున్న వారు కూడా వీళ్ళిద్దరిని ఆదరిస్తారు. వీళ్లు లీగ్ లో పాల్గొంటే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. త్వరలోనే ఇద్దరి పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్