తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత రాసిన తాజా లేఖ సంచలనమైంది. గులాబీ పార్టీలో ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతున్న సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయంగా ప్రస్తుతం గులాబీ పార్టీ బలపడే ప్రయత్నాల్లో ఉన్న సమయంలో కవిత సంచలనాలకు తెర తీశారు. పార్టీలో సీనియర్ నాయకులను గుర్తించడం లేదనే అసహనం ఆమె వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో లోపాలపై కూడా ఆమె కాస్త అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పార్టీ అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు పంపారు.
Also Read : జగనన్న.. మాకేంటి బాధ..!
గత కొన్నాళ్లుగా పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హరీష్ రావు పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినపడుతున్నాయి. ఆయన బిజెపి లేదా టిడిపికి దగ్గర అయ్యే సూచనలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో హడావుడి జరిగింది. ఇక కేటీఆర్ పదేపదే హరీష్ రావును ఇబ్బంది పెట్టే విధంగా పార్టీలో వ్యవహరిస్తున్నారని ప్రచారం సైతం జరిగింది. ఇటీవల హరీష్ రావు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ నాయకత్వంలో చివరి వరకు పనిచేస్తానంటూ స్పష్టం చేశారు.
Also Read : తండ్రికి ఉన్న దమ్ము లేదా..? అంత భయమెందుకు జగన్..?
హరీష్ రావు వ్యాఖ్యలను చూసిన కొంతమంది.. ఆయన కెసిఆర్ కు మాత్రమే విధేయుడు అని కేటీఆర్ కు లేదంటే కల్వకుంట్ల కుటుంబానికి కాదని అభిప్రాయపడ్డారు. హరీష్ రావు తో పాటుగా చాలామంది నాయకులు ఇదే అభిప్రాయాల్లో ఉన్నారనే అంశాన్ని కవిత గ్రహించినట్లుగానే అర్థమవుతుంది అనేది ప్రధానంగా వినపడుతోంది. హరీష్ రావుకు కాకుండా పార్టీ అధ్యక్ష బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించే ఆలోచనలను కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి గులాబీ పార్టీలో హరీష్ రావు సీనియర్. కాబట్టి ఆయనకే ప్రాధాన్యత దక్కాలని కవిత సహా చాలామంది సీనియర్ నేతల అభిప్రాయం అనేది ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న మాట. ఇదే విషయాన్ని పలుమార్లు కేసీఆర్ వద్ద కవిత వ్యక్తం చేశారని.. హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ ను ఆయన ముందు ఉంచారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా కాలేశ్వరం నోటీసుల సందర్భంగా హరీష్ రావును పిలిచి చర్చించారు కేసీఆర్. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడాలి.