Friday, September 12, 2025 09:13 PM
Friday, September 12, 2025 09:13 PM
roots

అతడికి ఛాన్స్ పక్కా.. గంభీర్ డిసైడ్ అయ్యాడా..?

టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న నేపధ్యంలో వారి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. జట్టులో కీలక స్థానాల్లో బ్యాటింగ్ చేసే సమర్ధ ఆటగాళ్ళు ఎవరు అనే దానిపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. రాబోయే ఇంగ్లాండ్ పర్యటన అత్యంత కీలకం కావడంతో ఏయే మార్పులు చోటు చేసుకుంటాయా అని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. కెఎల్ రాహుల్, గిల్, సాయి సుదర్శన్.. ఇలా చాలా పేర్లు చర్చకు వస్తున్నాయి.

Also Read : రిషబ్ పంత్ కెప్టెన్సీ ఊస్ట్..! లక్నో యాజమాన్యం నిర్ణయం..?

ముఖ్యంగా 4వ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేదే ప్రధాన ప్రశ్న. జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు టీమ్ ఇండియా యాజమాన్యం పూర్తిగా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఈ తరుణంలో హెడ్ కోచ్ గంభీర్ మరో ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గత దేశవాళి సీజన్ లో దుమ్ము రేపిన.. సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ ను నాలుగవ స్థానంలో ఆడించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కరుణ్ నాయర్ ప్రస్తుతం భీకర ఫాంలో ఉన్నాడు. 2024/25 సీజన్‌లో కరుణ్ నాయర్ నిలకడగా రాణించాడు.

Also Read : ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్న ధోనీ.. షాకింగ్ డెసిషన్..?

దీనితో ఇంగ్లాండ్ లో అతను ఉంటే ఖచ్చితంగా కలిసి వస్తుందని గంభీర్ భావిస్తున్నాడు. రాహుల్, జైస్వాల్ ఓపెనింగ్ చేయగా గిల్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక నాలుగో స్థానానికి కరుణ్ నాయర్, 5 వ స్థానంలో ఆల్ రౌండర్ లేదంటే రిషబ్ పంత్ ను తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక సాయి సుదర్శన్ కు కూడా అవకాశం కల్పిస్తే పంత్ 6, సాయి సుదర్శన్ 5వ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. 7 వ స్థానంలో ఆల్ రౌండర్ ను బరిలోకి దింపే అవకాశం ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్