Friday, September 12, 2025 09:04 PM
Friday, September 12, 2025 09:04 PM
roots

వైసీపీ – టీడీపీ మధ్య ప్యాలెస్ వార్..!

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు జరిగిన సరిగ్గా ఏడాదైంది. కానీ వైసీపీ నేతల మాటలు చూస్తే మాత్రం.. మరో ఆరు నెలల్లోనే ఏడాదిలోనే ఎన్నికలు అన్నట్లుగా ఉంది. కూటమి ప్రభుత్వాన్ని ప్రతి చిన్న విషయంలో కూడా తప్పుబడుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలను నిరంతరం టార్గెట్ చేస్తోంది. అయితే దాదాపు అన్ని విషయాల్లో కూడా వైసీపీ నేతల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గురివింద గింజ మాదిరిగా తమ కింది ఉన్న నలుపును గుర్తించకుండా.. ఎప్పుడూ ఎదుటి వారిపై బురద జల్లేందుకు వైసీపీ నేతలు తెగ ఆరాటపడుతున్నారు. అలా ప్రయత్నం చేసిన ప్రతిసారి బొక్కబోర్లా పడి తలవంపుల పాలవుతున్నారు కూడా.

Also Read : హస్తినలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..? రేవంత్ రెడ్డికి షాక్ తప్పదా..?

టీడీపీ-వైసీపీ నేతల మధ్య ప్రస్తుతం ప్యాలెస్ వార్ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ఏపీలో తన సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు ఏపీ రాజధాని అమరావతిలో సొంతంగా ఇళ్లు కట్టుకుంటున్నారు. వీటి పైనే ఇప్పుడు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబుకు ఇప్పటి వరకు ఏపీలో సొంత ఇల్లు లేదు. నారా వారి పల్లెలో తాతల కాలం నుంచి ఉన్న ఇంట్లోనే ఉన్నారు. తొలి నుంచి హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని ఇంట్లోనే ఉంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విజయవాడకు వచ్చేసిన చంద్రబాబు.. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఉండవల్లి సమీపంలోని లింగమనేని గెస్ట్ హౌస్ అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నారు. అంతే తప్ప ఏపీలో ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు. అయితే దీనిపై కూడా గతంల వైసీపీ నేతలు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు. చంద్రబాబుకు ఇల్లు లేదు… ఇక్కడ ఉండకుండా హైదరాబాద్ వెళ్లిపోతారు.. అదే జగన్‌కు మాత్రం తాడేపల్లిలో సొంత ఇల్లు ఉంది… కాబట్టి రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అని తెగ ప్రచారం చేశారు.

Also Read : ఎందుకీ మౌనం.. సైలెంట్ అయిపోయిన వైసీపీ సోషల్ మీడియా

అయితే వైసీపీ నేతల విమర్శలకు చెక్ పెడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కుప్పంలో ఇల్లు కట్టుకునేందుకు స్థలం కొనుగోలు చేశారు చంద్రబాబు. ఇందులో ఇంటి నిర్మాణానికి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు పెట్టింది. అయినా సరే అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వైసీపీ హయాంలోనే ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఆ ఇల్లు ఇప్పుడు దాదాపు పూర్తి కావొస్తోంది. అలాగే రాజధాని ప్రాంతంలో కూడా 5 ఎకరాల భూమి కొనుగోలు చేసి అందులో ఇల్లు నిర్మిస్తున్నారు. ఇప్పుడు వీటి గురించే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒకటి, కుప్పంలో ఒకటి, అమరావతిలో ఒకటి.. ఇంకెన్ని ప్యాలెస్‌లు కావాలి అంటూ గగ్గొలు పెడుతున్నారు. 5 ఎకరాల్లో గుడిసె కడుతున్నారా అని ఎద్దేవా చేస్తున్నారు. వాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Also Read : పోలవరంపై తొలిసారి రంగంలోకి మోడీ

అయితే వైసీపీ నేతల ఆరోపణలకు టీడీపీ నేతలు ధీటుగానే జవాబిస్తున్నారు. జగన్‌కు పులివెందులలో, బెంగళూరులో, హైదరాబాద్‌లో, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయని మరోసారి గుర్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఆస్తుల గురించి ప్రతి ఏడాది ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే ప్రకటిస్తున్నారనే విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ ఒక్క ఏడాది అయినా సరే తన ఆస్తులు వివరాలు ఎందుకు ప్రశ్నించటం లేదంటున్నారు. తన కుటుంబ ఆస్తుల గురించి చంద్రబాబు వివరించినట్లుగా జగన్ కూడా వివరిస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారు. అసలు తాడేపల్లిలో ఇల్లు ఉండగా.. మళ్లీ ప్రభుత్వ సొమ్ముతో విశాఖలో రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారో చెప్పాలంటున్నారు టీడీపీ నేతలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్