Friday, September 12, 2025 09:04 PM
Friday, September 12, 2025 09:04 PM
roots

హస్తినలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..? రేవంత్ రెడ్డికి షాక్ తప్పదా..?

తెలంగాణ రాజకీయ పరిణామాలు కాస్త ఈ మధ్యకాలంలో ఆసక్తిని రేపుతున్నాయి. ప్రభుత్వం కూలిపోతుందని కొంతమంది, హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నారని మరి కొంతమంది, కవిత భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తున్నారని ఇంకొంతమంది, సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఈ సమయంలో మరో వార్త తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. రాజకీయంగా అధికారంలోకి వచ్చిన కొత్తలో రేవంత్ రెడ్డి బలంగా కనపడినా, ఆ తర్వాత మాత్రం ఆయన కాస్త పార్టీ పై ప్రభుత్వం పై పట్టు కోల్పోయారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : బీజేపీని ఆడేసుకుంటున్న కాంగ్రెస్.. సెల్ఫ్ డిఫెన్స్ లో ఫెయిల్..?

సాధారణంగా రేవంత్ రెడ్డిలో దూకుడు ఎక్కువగా ఉంటుంది. అది రాజకీయపరంగా అయినా ప్రసంగాలపరంగా చూసుకున్నా సరే ఎక్కువే. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంపై పట్టు కోల్పోయారు అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తుంది. ముఖ్యంగా సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యేలను ఆయన కట్టడి చేయలేకపోతున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మాట వినకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Also Read : ప్రభుత్వం కూలుతుందా..? సైలెంట్‌గా కాంగ్రెస్..?

ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి పొగ పెట్టే నాయకులు కూడా వారే అనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో తమకున్న పరిచయాలతో రేవంత్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేసేందుకు సదరు నాయకులు సిద్ధంగా ఉన్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే సదరు నాయకులు దేశ రాజధానిలో తిష్ట వేశారని, పార్టీ అధినాయకత్వానికి తమ ఆవేదనను వివరించి, ఒకవేళ అధిష్టానం ఏదైనా నెగిటివ్ గా రెస్పాండ్ అయితే అవసరమైతే పార్టీ నుంచి బయటికి రావాలని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి స్వేచ్ఛ ఇచ్చిన సరే చిన్న చిన్న పనులు కూడా ఎమ్మెల్యేలు చేయించుకోలేకపోతున్నారు అనే ఆవేదన వారిలో కనపడుతుంది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ప్రభుత్వం కూలిపోతుందనే కామెంట్స్ వినపడుతున్న సరే ఎమ్మెల్యేల నుంచి స్పందన లేకపోవడం మరింత ఆశ్చర్యం కలిగించే అంశం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్